కరీంనగర్

నేరస్థుల కదలికలపై నిఘా కోసమే సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 18: నేరస్థుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచేందుకే ‘సకల నేరస్థుల సమగ్ర సర్వే’ను నిర్వహించడం జరుగుతుందని నార్త్‌జోన్ ఐజీ వై.నాగిరెడ్డి అన్నారు. నార్త్‌జోన్ పరిధిలో వివిధ రకాల నేరాలకు పాల్పడిన వారు 51వేల మంది ఉన్నారని, జోన్ పరిధిలో 715 బృందాలతో సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. సకల నేరస్థుల సమగ్ర సర్వేలో భాగంగా కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌లోని సెల్‌ఫోన్, చైన్‌స్నాచర్ మద్నాల నవీన్ ఇంటిని సందర్శించి దొంగ వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి నేరాలకు పాల్పడుతున్న నేరస్థుల వివరాలను సేకరించేందుకు ఈ సర్వే చేపట్టినట్లు తెలిపారు. నేరస్థులు, వారి బంధువులు, స్నేహితులు, వారు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో, ఆ సంస్థలకు సంబంధించిన వివరాల సేకరణ జరుగుతోందని అన్నారు. సర్వే వివరాలను జియోట్యాంగింగ్ చేసి, టీఎస్ కాప్ యాప్‌కు అనుసంధానం చేయనున్నట్లు వివరించారు. ఈ ప్రాంతానికి చెందిన నేరస్థులు ఎక్కడ నేరాలకు పాల్పడినా, వారి సమాచారం స్థానిక పోలీసు స్టేషన్‌లకు చేరుతుందని అన్నారు. తరచూ నేరాలకు పాల్పడే వారిపై నిఘా ఉంటుందని చెప్పారు. పద్ధతులను మార్చుకుని, సాధారణ జీవనాన్ని కొనసాగిస్తున్న పాత నేరస్థులకు ఏలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. సర్వే సందర్భంగా సేకరించిన సమాచారాన్ని టీఎస్‌కాప్‌యాప్‌లో నిక్షిప్తం చేయడం వల్ల ఎక్కడైనా వాహనాల తనిఖీలు, కార్డన్ అండ్ సెర్చ్‌ల సందర్భంగా నేరస్థులు తటస్థ పడినట్లయితే వారు అబద్దం తెలిపినా ఇట్టే తెలిసిపోతుందని అన్నారు. ఈ సర్వే ద్వారా నేరాలు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నేరాల నియంత్రణకు, ఛేదనకు కరీంనగర్ కమిషనరేట్‌లో తీసుకుంటున్న వివిధ రకాల చర్యల వల్ల 30శాతం నేరాలు తగ్గాయని చెప్పారు. పోలీసులు చేపడుతున్న చర్యలు నేరస్థుల గుండెల్లో గుబులు రేపుతున్నాయని నాగిరెడ్డి అన్నారు. ఆయన వెంట సీపీ కమలాసన్‌రెడ్డి, ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.

నిత్య జాతీయ గీతాలాపనతో దేశభక్తిపెరుగుతుంది
* మేయర్ రవీందర్‌సింగ్
కరీంనగర్ టౌన్, జనవరి 18: నిత్యం జాతీయ గీతాలాపన చేయటంతో ప్రజల్లో దేశభక్తి, జాతీయభావం పెరుగుతుందని మేయర్ రవీందర్‌సింగ్ అన్నారు. నగరంలోని టవర్ సర్కిల్‌లోఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా నిత్య గీతాలాపన చేసేలా చర్యలు తీసుకోవాలని, దీంతో విద్యార్థులు, ఉద్యోగుల్లో క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. బల్ధియా కమీషనర్ కె.శశాంక మాట్లాడుతూ, జాతీయ గీతాలాపనతో దేశంపై అభిమానం పెరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని టవర్ సర్కిల్ నుంచి నగరమంతా విస్తరిస్తామని అన్నారు. నిత్య గీతాలపనకు నగర వాసులు సహకరించాలని, దీనిని యువకులు పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పోరేటర్లు, స్థానికులు, పలు విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు.