కరీంనగర్

సమగ్ర సర్వేతో నేరస్థుల్లో దడ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టి.శంకర్
గోదావరిఖని, జనవరి 18: రాష్ట్రంలో నేరాలను పూర్తి స్థాయిలో అదుపులో ఉంచేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ మహేందర్ రెడ్డి తీసుకున్న వినూత్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పాత నేరస్థుల సమగ్ర సర్వేతో నేరస్థుల గుండెల్లో దడ మొదలైంది... నేరాలనే వృత్తిగా ఎంచుకున్న వారికి... డబ్బుల కోసం నేర ప్రవృత్తిని మార్గంగా చేసుకున్న కొంతమంది కరుడుగట్టిన నేరగాళ్లను వణికిస్తోంది. ఇప్పటి వరకు నేరాలపై నేరాలు చేసుకుంటూ పోతూ... అడ్రస్‌ల మార్పులు... మారుపేర్లతో నేరాలను కొనసాగిస్తూ ఏకంగా ప్రదేశాలనే మార్చేసి... ఇతర ప్రాంతాల్లో స్థిరపడి తమకు అడ్డేలేదన్న విధంగా నేర ప్రవృత్తిని కొనసాగిస్తున్న కొందరి పాత నేరస్థుల ఆగడాలకు పోలీసు శాఖ తీసుకున్న సరికొత్త సర్వే నిర్ణయంతో చెక్‌పడే అవకాశం కనిపిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ తద్వారా నేర నియంత్రణ లక్ష్యంగా పోలీస్ శాఖ ముందుకు సాగుతున్న క్రమంలో పాత నేరస్థుల సమాచార సేకరణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపూర్ణంగా వాడుకునేందుకు సిద్ధమై జియో ట్యాగింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. పాత నేరస్థులకు సంబంధించిన నివాస వివరాలు, నేరగాళ్ల ఫొటోల సేకరణ, ఫింగర్ ప్రింట్స్, ఆధార్‌తోపాటు ఇతర ధ్రువీకరణ పత్రాల వివరాలు సేకరణంతా కూడా ఒక ప్రత్యేక ఫార్మాట్‌లో సేకరించి దీన్ని జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేయనున్నారు. ఇలా పాత నేరస్థుల సమచారాన్నంతా కూడా సేకరించడం పూర్తయితే రాష్ట్రంలోని ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పాత నేరస్థులు మళ్లీ అల్లర్లు చేసేందుకైనా... అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేందుకైనా... చోరీలకు తెగపడేందుకైనా... వెనకడుగు వేయక తప్పదు. అయితే ఈ పాత నేరస్థులు ఊరు విడిచి వెళ్లే ఆలోచనకు రావడం కూడా సాధ్యపడని విధంగా సర్వే సేకరణ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పాత నేరస్థుల సమగ్ర సర్వే గురువారం రామగుండం కమిషనరేట్ పరిధిలో కూడా ప్రారంభమైంది. పోలీస్ కమిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ ఎసిపి అపూర్వ రావుతో కలిసి గోదావరిఖని సబ్ డివిజన్‌లో నేరస్థుల వివరాలను సేకరించారు. కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తంగా వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న 11890 మంది పాత నేరస్థులుండగా వీరిలో 10664 మంది పాత నేరస్థులు ఈ ప్రాంతాల్లోనే నివసిస్తుండగా మిగతా వారు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలల్లో ఉంటున్నారు. మొదటి రోజు కమిషనరేట్ పరిధిలో సాయంత్రం వరకు సుమారు 3వేల మంది పాత నేరస్థుల సమాచారాన్ని సేకరించిన్నట్టు సిసిఎస్ ఏసీపీ చంద్రయ్య తెలిపారు.