కరీంనగర్

అంత్యక్రియలలో తేనేటీగల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, జనవరి 20: అంత్యక్రియలు చేస్తుండగా తేనేటీగలు దాడిచేసిన సంఘటన జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు స్మశాన వాటిక వద్ద శనివారం చోటుచేసుకుంది. పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన ముత్తునూరి రాజమల్లు అనారోగ్యంతో మృతిచెందగా, ఆయన అంత్యక్రియల కోసం కుమారులు రమేష్, స్వామీ, మల్లిఖార్జున్, అజయ్‌లు స్మశాన వాటికకు వెళ్లారు. ఇంతలో తేనేటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో మృతదేహాన్ని వదిలి పరుగులు తీసారు. మరికొద్ది సేపటికి తర్వాత అంత్యక్రియలు పూర్తిచేసిన అనంతరం చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అంత్యక్రియల దాడిలో కోడలు సరోజ, మనవరాలు అఖిలతో పాటు మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు.

అధికారులతో మంత్రి సమీక్ష
చొప్పదండి/రామడుగు, జనవరి 20: గవర్నర్ కాళేశ్వరం పనులను పరిశీలించి వెళ్లిన అనంతరం భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల నిర్వాహణపై అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తు వివిధ స్థాయిల్లో ఉన్న అధికారుల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులు అనుకున్న స్థాయిలో చేస్తున్నారా? అంటూ ఆరా తీశారు. పనులు వేగవంతం చేయాలని, అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
8వ ప్యాకేజి పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయని ఇక ముందు కూడ అలాగే జరగేలి అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారని, ప్రజలు ఎంతో ఆతృతతో చూస్తున్నారని, అందుకే అనుకున్న సమయానికి పనులు పూర్తి కావాలని ఆదేశించారు.