కరీంనగర్

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొప్పదండి/రామడుగు, జనవరి 20: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 8వ ప్యాకేజి పనులను చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని రామడుగు మండల లక్ష్మిపూర్ గ్రామంలో శనివారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పరిశీలించారు. హెలీక్యాప్టర్ దిగగానే పోలీసులు భారీ బందోబస్తు మధ్య ప్రాజెక్టు పనుల క్యాంపు వద్దకు తీసుకువచ్చి పోలీసులు ఇచ్చిన గౌరవ వందనాన్ని గవర్నర్ దంపతులు స్వీకరించారు. ఈ మేరకు ప్రాజెక్టు పనులలో భాగంగా ఆయనను స్థానిక సర్పంచ్ జంకె దీప్తి ఘన స్వాగతం పలికారు. అనంతరం నేరుగా ప్రాజెక్టు పనులను సొరంగ మార్గం గుండా వెళ్లి పూర్తి స్థాయిలో పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే పనులు చేస్తున్న కూలీల దగ్గరకు వెళ్లి పని ఎలా చేయుచున్నారు ? వేతనాలు అందుతున్నాయా? ఎలా ఇస్తున్నారు అంటు ఆరా తీయగా తాము ఆన్‌లైన్ ద్వారానే డబ్బులు అందుకుంటున్నామని తెలిపారు. ప్రాజెక్టు పనులను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. టనె్నల్‌లోనే అన్ని సౌకర్యాలు ఏర్పరుచుకొని 24 గంటలు పనిచేస్తున్న తీరుపట్ల సంతోషం వ్యక్తం చేశారు. మొదటి పేస్ పనులు జూన్, జులై నాటికి పూర్తవుతాయని అన్నారు. కాళేశ్వరుడి ఆశిస్సులతో ప్రాజెక్టు పనులను పూర్తి చేయటం జరుగుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తాం అని చెప్పారు. కాగా, గవర్నర్ దంపతులను సన్మానించాల్సిందిగా మంత్రి హరీష్‌రావును అధికారులు కోరగా అక్కడికి వచ్చిన స్థానిక సర్పంచ్ జంకె దీప్తిని పిలిచిన హరీష్‌రావు దీప్తి చేతుల మీదుగా గవర్నర్ దంపతులను సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి జోషి, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సీపీ కమలాసన్‌రెడ్డి, ఎంపిపి కిష్టారెడ్డి, దేవిప్రసాద్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
మేడారం పంపు హౌస్ పరిశీలన
ధర్మారం: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో బాగంగా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో నిర్మిస్తున్న పంపుహౌస్‌ను శనివారం భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరిష్‌రావుతో కలిసి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అరవ ప్యాకేజి పనుల్లో భాగంగా ప్రభుత్వం మేడారం పంపు హౌస్‌ను నిర్పిస్తోంది. గవర్నర్ పర్యటనలో భాగంగా కాళేశ్వరం నుండి సుందిళ్ల బ్యారేజ్‌ను సందర్శించిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు గాను హెలిక్యాప్టర్‌లో ఇక్కడకు చేరుకోగా, మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి ప్రత్యేక వాహనంలో రెండు కిలో మీటర్ల దూరంలో సోరంగ మార్గంలోకి వెళ్లి పంపు హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట గవర్నర్ సతిమణి కూడా ఉన్నారు. రాష్ట్ర బారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్వయంగా గవర్నర్ దంపతుల వెంట ఉండి సోరంగ మార్గం పనులను చూపించడమే కాకుండా సంబంధిత అధికారుల ద్వారా ప్రాజెక్ట్ నిర్మాణ పనుల తీరు వివరించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ దేవసేనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.