కరీంనగర్

యువకుడి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాపూర్, జనవరి 21: మండలంలోని ఎలబోతారం గ్రామంలో శనివారం రాత్రి మ్యాకల హరీష్ (24) అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల ప్రకారం..మృతుడు హరీష్ తమ్ముడు తెలిపిన వివరాల ప్రకారం..శనివారం రాత్రి ఇదే గ్రామానికి చెందిన తూముల రేష్మా అనే వివాహిత ఇంటికి రాత్రి వెళ్లగా రేష్మకు, హరీష్‌కు గొడవ అవుతుందని తెలుపగా మృతుడి తమ్ముడు అరవింద్ ఏంటి గొడవ అని ప్రశ్నించగా పది నిమిషాల్లో మీ అన్నయ్యను పంపిస్తా నీవు వెళ్లిపో అని చెప్పింది. అరవింద్ తన సోదరుని ఇంటికి రమ్మనగా వస్తున్నా నీవు ఇక్కడి నుంచి వెళ్లిపో అని తెలిపిన 30 నిమిషాల్లో మళ్లీ స్థానికులు మీ అన్నయ్య చనిపోయాడని తెలుపగానే వెళ్లి చూడగా ములుగు కొమురయ్య ఇంటిలో రేష్మ కిరాయికి ఉంటుంది. అరవింద్ వెళ్లి చూడగా చీరతో ఉరివేసుకొని పడి ఉన్నాడు. రేష్మ కుటుంబ సభ్యులు తన అన్నను కొట్టి గాయాలుపాలు చేసి చంపేశారని, తరువాత ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారన్నారు. తన అన్న మృతికి రేష్మ, తన భర్త రవితో పాటు తల్లిదండ్రులైన చాంద్ పాషా, గౌసీయా భేగం ముగ్గురు అన్నదమ్ముళ్లు, వదినలే కారణమంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాపూర్ ఎస్‌ఐ నూతి శ్రీ్ధర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ములుగు కొమురయ్య ఇంటిలో కిరాయికి ఉంటున్న రేష్మ ఫరారు కావడంతో ఇంటి ముందు ఆందోళన చేశారు. హుజూరాబాద్ రూరల్ సిఐ రవి కుమార్ మృతుడు హరీష్ కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో విరమించుకున్నారు. మృతిపట్ల పలువురు పలురకాలుగా చర్చించుకుంటున్నారు.

అమ్మాబాబా అరెస్ట్
ముకరంపుర కరీంనగర్, జనవరి 21: మంత్రతంత్రాలతో మాయ మాటలు చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఆరెపల్లికి చెందిన దొంగ అమ్మాబాబాలను ఆదివారం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరెపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి వెంకటి బాబాగా, ఇతని భార్య గత కొన్ని సంవత్సరాలుగా అమాయక ప్రజలను మాయ మాటలు చెపుతూ మోసం చేస్తున్నారు. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు పక్కా ప్రణాళికతో వీరిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుండి 500 రూపాయల నగదు, గవ్వలు, తాయత్తులు, విబూది, కొబ్బరికాయలు, నిమ్మకాలు, నెమలీకల కట్ట, ఇతర పూజా సామాగ్రి స్వాధీనం చేసుకొని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.