కరీంనగర్

గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంథని, జనవరి 21: ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో మొదలు పెట్టిన ప్రాజెక్టులను సందర్శించి వాటి పని తీరును మెచ్చుకున్న గవర్నర్‌పై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం ఆయన మంథని మార్కెట్ కమిటిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయని కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేస్తున్న తరుణంలో విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ ప్రాజెక్టు పేరుతో కమీషన్‌లు తీసుకున్న నాయకులు వాటిని పూర్తి చేసే విషయంపై ఏనాడు శ్రద్ద చూపలేదన్నారు. మా ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతుంటే వాటిని పరిశీలించిన గవర్నర్ ఇంత వేగవంతంగా పనులు జరగడం ఎక్కడ చూడలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్బుతం అనడంలో తప్పేంటని ప్రశ్నించారు. అంతేకాకుండా మేడిగడ్డ ప్రాజెక్టును కేంద్ర మంత్రి గడ్కరి, సీతి అయోగ్ బృందం, కేంద్ర జల వనరుల శాఖ ఇంజనీర్లు కూడా ప్రశంసించారని, అయితే అలాంటప్పుడు వారు కూడా టిఆర్‌ఎస్ ఏజెంట్‌లేనని అంటారా అని ప్రశ్నించారు. గతంలో మేము ప్రతి పక్షంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం చేపట్టిన 108 కార్యాక్రమాన్ని మేము అభినందించాం, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో ప్రాజెక్ట్‌లకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులను ఇప్పించుకో గలిగారా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, కమాన్‌పూర్ జడ్పిటిసి సంపత్, మార్కేట్ కమిటి చైర్మన్ ఆకుల కిరణ్, ఎంపిపి కమల,సర్పంచ్ పుట్ట శైలజలతో పాటు నాయకులు శంకర్‌లాల్, శంకర్‌లు ఉన్నారు.