కరీంనగర్

ప్రభుత్వ రంగ సంస్థలను బతికించేందుకు సీఎం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జనవరి 21: ప్రభుత్వ రంగ సంస్థలను బతికించేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహ రెడ్డి అన్నారు. ఆదివారం ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని ఫంక్షన్ హాల్‌లో ఎన్టీపీసీ గుర్తింపు యూనియన్ సర్వసభ్య సమావేశానికి మంత్రి నాయిని ముఖ్య అతిథిగా హాజరై కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కార్మిక వర్గానికి మేలు జరిగేందుకే టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు పని చేస్తుందని, రామగుండం ఎన్టీపీసీలో కొత్త థర్మల్ కేంద్రం, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, సింగరేణిలో కొత్త గనుల నిర్మాణంకు ముందుండి పని చేస్తుందని చెప్పారు. కార్మిక హక్కులను కాపాడుకునేందుకు అవసరమైనప్పుడు పోరాటాలు తప్పవని వివరించారు. కార్మిక వర్గమంతా సంఘటితంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ సొమారపు సత్యనారాయణ, ఎన్టీపీసీ గుర్తింపు యూనియన్ కార్యదర్శి సిహెచ్ ఉపేందర్, ప్రతినిధులు కొమ్ము సారయ్య, సిహెచ్.నారాయణ రెడ్డి, గట్టయ్య, వీరయ్య, కిషన్ రావు, అనంత రెడ్డి, నరేష్, నారాయణ గౌడ్, కంది రాజేశం, కోట మల్లేష్‌తోపాటు తదితరులున్నారు. అనంతరం ఆయనను యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు.