కరీంనగర్

గుడిలోనూ మారని పవన్ స్టైల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్యాల, జనవరి 22: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకుని ఆలయంలో అధ్యాత్మికత చాటుకుని ఉండాల్సి ఉండగా, గుడి ప్రాంగణంలో రద్దీతో తోపులాట జరిగింది. ఈ తోపులాట సందర్బంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తన సీనిమాలో స్టైల్లో వేలు చూపించి పక్కవారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం పలువురి కంట పడింది. దీంతో పవర్ స్టార్ పవనన్న స్టైల్ గడిలో కూడా మారలేదని పలువురు వాఖ్యానించారు. పోలీసులు మీడియాను అభిమానులను ఆలయం బయట ఉంచినప్పటికీ ఒకరెనక ఒకరు రిక్వేస్ట్‌లు చేస్తూ గుడి ప్రాంగణం నిండిపోయారు. అభిమానులను కంట్రోల్ చేయడంలో సిఐ శ్రీనివాస్ చాకచక్యంగా వ్యవహరించడంతో తోపులాటలు జరగలేదని అధికారులు, అర్చకలు అభినందించారు. ఎది ఎమైనా పవర్ స్టార్ రాజకీయ మెట్టుకోసం కొండగట్టుకు వచ్చి కొండంత ప్రకటనలు చేస్తారని భావించిన అభిమానులకు గోరంత చిరునవ్వుతో అభివాదం చెప్పి వెళ్లడంతో ఇటు అభిమానుల్లో అటు ఇతర పార్టీ నేతల్లో విస్మయానికి లోనయ్యారు.

ఇసుక స్తంభం మంటపంలో వసంతోత్సవ వేడుకలు
ధర్మపురి, జనవరి 22: ధర్మపురి క్షేత్రంలో సోమవారం సాయంత్రం నుండి రాత్రి వరకు వసంతోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. వసంత పంచమి సందర్భంగా సాయంత్రం 6గంటలకు ప్రధాన ఆలయ ప్రాంగణాన ప్రత్యేక ఉత్సవ పూజలు నిర్వహించిన అనంతరం ఆలయాల నుండి యోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నారసింహ స్వాముల ఉత్సవ మూర్తులను మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో ఇసుక స్తంభం వద్దకు ఊరేగింపు నిర్వహించి, ఇసుక స్తంభాంతర్గత వేదికపై ఉంచి వేద మంత్రోచ్చరణల మధ్య వసంతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అశేష భక్త జనంపై వసంతాన్ని చల్లారు. దేవస్థానం ఇఓ సుప్రియ, చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, ధర్మకర్తలు రమాదేవి, భాగ్యలక్ష్మి, వేంకటేశ్వర్‌రావు సునీల్‌కుమార్, లింగన్న, రాజన్న ఆధ్వర్యంలో దేవస్థాన వేద పండితులు బొజ్జ సంపత్ కుమార శర్మ ఆచార్యత్వంలో, ముత్యాల శర్మ, బొజ్జా సంతోష్, రాజగోపాల్, పాలెపు ప్రవీణ్ శర్మ, ప్రధానార్చకులు నంబి రఘునాథాచార్య, ఉప ప్రధానార్చకులు శ్రీనివాసాచార్య, వేద పండితులు మధు శంకరశర్మ, సంగనభట్ల హన్మాండ్లు శర్మ, ఒజ్జల విశ్వనాథ శర్మ, పణతుల శంకరశర్మ, కొరిడె సదాశివ శర్మ, పాలెపు చంద్రవౌళి శర్మ, గుండి మహదేవ్ శర్మ సంప్రదాయ పద్ధతిలో కార్యక్రమాన్ని నిర్వహించారు.