కరీంనగర్

కరవు పీడిత ప్రాంతాలకు వరప్రదాయిని గౌరవెల్లి ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్నాబాద్, జనవరి 22: కరవు పీడిత ప్రాంతాలకు వరప్రదాయినీ గౌరవెల్లి ప్రాజెక్టని, మిడ్‌మానేరు కాలువ వరద కాలువ కాదు జీవకాలువని తెలంగాణ రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్‌లో అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి రిజర్వాయర్ జలాశయానిర్మాణ పనులకు సోమవారం ఎంపి వినోద్‌కుమార్,కలెక్టర్ వెంకట్రాంరెడ్డిహుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌బాబు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డితోకలిసి భూమి పూజ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగా సభలో మాట్లాడుతూ ఈ గౌరవెల్లి రిజర్వాయర్ ద్వారా కరీంనగర్,వరంగల్,జనగామ జిల్లాలోని నియోజకవర్గ ప్రజలకు లక్షా 20వేల ఎకరాలకు సాగు, తాగు నీరుఅందడం కష్టమని భావించి ఈ జలాశయం సామర్థ్యం పెంపు అవసరమని సీఎం కేసీఅర్ నిర్ణయించి రీ డిజైన్ చేయించి 1.43 ఉన్న ప్రాజెక్టును 8.23గా పెంచి నీటి నిలువ సామర్థ్యం ఉండేలా చేశారని తెలిపారు.దీనితో గౌరవవెల్లి రిజర్వాయర్ ద్వారా కరవు పీడిత ప్రాంతాలకు లక్షా20వేల ఎకరాలకు సాగు నీరు తాగు నీరు రెండు పంటలకు అందించడమే లక్ష్యంగా ముఖ్య మంత్రి సూచలను చేశారని తెలిపారు. ఒకప్పుడు ప్రాజెక్టులు అంటే కల అని నేడు టిఅర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక నిజమని అన్నారు.1.4 టీఎంసీల వరద కాలువ ఉన్నప్పుడు 693 ఇళ్లు మునిగితే నేడు 9 టీఎంసీలకు పెంచితే అదనంగా నష్ట పోతున్న గృహాలు 150 మాత్రమే నన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేపడుతున్నామని ఇప్పటికే 75 శాతం పనులు పూర్తి అయినట్లు తెలిపారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మాణం 96శాతం పూర్తి అయినట్లు తెలిపారు.గౌరవెల్లి పూర్తి కాకపోయిన ఎలాంటి ఎత్తి పోతలు లేకుండ 80వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్నట్లు తెలిపారు 75 కిలో మీటర్ల కావలు పనులకు గాను ఇప్పటికే 73కిలో మిటర్లు పని పూర్తి అయినట్లు చెప్పారు. ఎవరు అడ్డుపడ్డా వచ్చే వానకాలనికి కళేశ్వరం ప్రాజెక్ట నీళ్లు హుస్నాబాద్‌కు వస్తాయని తెలిపారు. ఈప్రాజెక్టు క్రింద 9వందల ఇళ్లు ముప్పునకు గురౌతుంటే ఇందులో 7వందల కుటుంబాలకు పైగా ఒప్పుకున్నారని అన్నారు.మిగత కుటుంబాల వారితో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని అన్నారు.గత ప్రభుత్వం ఎకరాకు 2లోలక్షాలు ఇస్తే నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 7లక్షలు చెల్లిస్తున్నామని అన్నారు. ఎవరు అవునన్న కాదన్న తెలంగాణలో 25 సంవత్సరాలు టీఅర్ ఎస్ ప్రభుత్వమే అధికారలో ఉంటుందని అన్నారు.
అభివృద్ధి పనులకు నష్టాలు తప్పవు : ఎంపి వినోద్ కుమార్
ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసం చేపట్టె అభివృద్ధి పనుల్లో నష్టాలు తప్పవని కరీంగర్ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా నష్ట పోతున్న రైతుల ప్రభుత్వ సహకరించాలని మీ త్యాగాలు రాబోవు తరాలకు ఉపయోగపడుతాయని అన్నారు. గత ప్రభుత్వాల కంటే నేడు తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో దుసుకుపోతుందని దీనికి అందరు సహకరించాలని కొరారు.
పనులను అడ్డుకుంటే కఠిన చర్యలు : కలెక్టర్ వెంకట్రాంరెడ్డి
గౌరవెల్లి ప్రాజెక్టు క్రింద ఇప్పటికే 17వందల ఎకరాలు భూమిని సేకరించామని మరో 3వందల ఎకరాలు భూ సేకరణ పనులు పూర్తి చేస్తామన్నారు.్భ నిర్వాశితుల కష్టలు నాకు తెలుసని వారికి సమస్యలు ఉంటే నాతోనేరుగా చెప్పాలని కొరారు. సమస్యలు చెప్పకుండా పనులు అడ్డుకుంటే కఠిన చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారుల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సహకార సంఘాల బలోపేతానికి చర్యలు
* టీస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు * అప్పన్నపేటలో సహకార బ్యాంకు ప్రారంభం

పెద్దపల్లి రూరల్, జనవరి 22: వ్యవసాయ సహకార పరపతి సంఘాల బలోపేతానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని టీస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు పేర్కొన్నారు. ముఖ్యం గా బ్యాంకు సేవలు మరింత విస్తరించి రైతుల లావాదేవీలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రధాన దృష్టి సారించినట్టు ఆయన తెలిపారు. మండలంలోని అప్పన్నపేట గ్రామం లో 27 లక్షల రూపాయలతో నిర్మించిన వ్యవసాయ సహకార బ్యాంకును స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద రావుతో కలసి ఆయన సోమవారం ప్రారంభించారు. అలాగే కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎఫ్‌ఆర్‌డీఏ బిల్లు వల్ల ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సహకార బ్యాంకులో డిపాజిట్లకు పూర్తి గ్యారంటీ తమదేనని తెలిపారు. సహకార సంఘాలు అన్ని బ్యాంకులుగా మార్చడానికి తగిన కృషి చేస్తున్నట్టు వివరించారు. గత యేడాది సహకార బ్యాంకుల ద్వారా 45 లక్షల రూపాయల లాభాలు ఆర్జించినట్టు తెలిపారు. సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు యజమానులేనని, రాబోవు కాలంలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కోన్నారు. అన్ని బ్యాంకులలో మీనీ ఏటీఏంలు ఏర్పాటు చేశామని, అలాగే మైక్రో ఏటీఏంల ద్వారా లావాదేవీలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని అన్ని సంఘాలను కంప్యూటీకరణ పూర్తి చేసి, సహకార సంఘాలు బ్యాంకులకు అనుసంధానం చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ యాట దివ్యారెడ్డి, నగర పంచాయితీ చైర్మన్ ఎలువాక రాజయ్య, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ముద్దసాని రాజిరెడ్డి, వైస్ చైర్మన్ ఆల్వాల దామోదర్ రెడ్డి, సర్పంచు మందల రమాదేవి-సత్యనారాయణరెడ్డి, ఉప సర్పంచ్ ఆరె తిరుపతి, కార్యానిర్వాహణ అధికారి కొమ్ము జగన్, కేడీసీసీ బ్యాంకు అధికారులు నర్సింగరావు, శ్రీకాంత్, రాకేష్, డైరెక్టర్లు పోలంపల్లి అశోక్, రాజయ్య, వెంకటమ్మ, శారద, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.