కరీంనగర్

ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జనవరి 23: ప్రస్తుత పరిస్థితుల్లో భూగర్భ జలాలు అడుగంటకుండా ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని మేయర్ రవీందర్‌సింగ్ పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని కోర్టు రిజర్వాయర్ సమీపంలో ఇంకుడుగుంత నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి, భూమి పూజ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, ఇప్పటికే నగరంలోడివిజన్ల వారీగా పలు ఇళ్ళలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. వృథాగా పోయే నీటిని ఒడిసి పట్టాలంటే ఇంకుడు గుంతలు లేని ప్రతి ఒక్కరు నిర్మించుకోవాలని, వర్షం నీటితో పాటు ఇళ్లలో వృథాగా పోయే నీరు ఇంకుడు గుంతలకు మల్లిస్తే భూగర్భ జలాలు అడుగంటి పోకుండా ఉంటాయన్నారు. మేయర్ వెంట బల్దియా కమీషనర్ కె.శశాంకతోపాటు పలువురు కార్పోరేటర్లు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం పరోక్ష ఎన్నికలు
* మాజీ ఎంపి పొన్నం
వేములవాడ,జనవరి 23: పరోక్షంగా సర్పంచ్‌ను ఎన్నుకునే విధానం ప్రజాస్వామ్య స్ఫూర్తి విరుద్దమని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. మంగళవారం వేములవాడ మండలంలోని మారుపాక గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.్ఫరాయింపులను ప్రోత్సహించేందుకు పంచాయితీలకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలనుకుంటుందని దుయ్యబట్టారు. ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహిస్తే తమకు వ్యతిరేఖంగా ఫలితాలు వస్తాయని భయంతోనే దొడ్డిదారిన పరోక్ష ఎన్నికలకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.