కరీంనగర్

ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జనవరి 23: స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు మంగళవారం నగరంలో ఘనంగా జరిగాయి. పలు పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పలు ఆస్పత్రులు, వృద్ధాశ్రమాల్లో పండ్లు పంపిణీ చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్‌నగర్‌లో గల ఆయన విగ్రహానికి కొరిటాల శివరామకృష్ణ, దామెర సత్యంలు పూల మాలలు వేశారు. తెలుగు మహిళ జిల్లా శాఖ అధ్యక్షురాలు తీట్ల ఈశ్వరి, ఎడ్ల వెంకటయ్య, చెల్లోజు రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం బోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి, దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రమ్యారావు, గుగ్గిల్ల జయశ్రీ, గందె మాధవి, కర్ర రాజశేఖర్, అజిత్‌రావు, తదితరులు పాల్గొన్నారు. ఆలిండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడు గవ్వ వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నగరంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత స్వాతంత్య్ర సంగ్రామంలో తనదైన శైలిలో పోరాడి, దేశ సేవలో తరించిన మహానీయుడని కొనియాడారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని ఆ సంఘం జిల్లా కార్యాలయంలో బోస్ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికందించిన సేవలు గుర్తు చేస్తూ, భారత జాతి స్పూర్తిదాతగా పేరుగాంచిన సుభాష్ చంద్రబోస్ దేశానికే గర్వకారణమన్నారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆ సంఘం జిల్లా కార్యాలయంలో సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోమాళ్ళ రాజేందర్‌రెడ్డి బోస్ సేవలను కొనియాడారు. నేటి రాజకీయ నేతలు సుభాష్ జీవితాన్ని, ఆయన పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శివసేన జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయంలో సుభాష్ చంద్రబోస్, శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ థాకరే జయంత్యుత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణుప్రసాద్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

బీజేపీ కలెక్టరేట్ ముట్టడి భగ్నం
పెద్దపల్లి, జనవరి 23: చివరి భూములకు సాగునీరందించాలని బీజేపీ తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున శాంతిభధ్రతకు విఘాతం కలుగకుండా బీజేపీ నాయకులను వేకువజామునే పోలీసులు ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది కలెక్టరేట్ లోనికి వచ్చే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఐలు నరేందర్, రాములు, కిషోర్,ఎస్సైలు జగదీష్, విజయేందర్, రవికుమార్‌లు ఎప్పటి కప్పుడు పర్యవేక్షణలో ఉన్నారు.