తెలంగాణ

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 22: యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉన్మాదిగా మారి తల్లిదండ్రులు సహా రోడ్డుమీద దొరికినోళ్లను దొరికినట్లుగా తల్వార్‌తో గాయపరుస్తూ బీభత్సం సృష్టించి చివరకు పోలీసుల తూటాకు బలయ్యాడు. కరీంనగర్‌లోని కమాన్ ప్రాంతంలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. లక్ష్మినగర్‌కు చెందిన అవతార్‌సింగ్, సత్వంత్‌బేబికౌర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. కుమార్తెలిద్దరికీ పెళ్లిళ్లయ్యాయ. కుమారుడు బల్వీందర్‌సింగ్ (26) బెంగుళూరులోని ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఏడాదికి రూ.18 లక్షల జీతంతో ఉద్యోగం చేస్తున్నాడు. మరోపక్క ఐఏఎస్ కావాలన్న కోరికతో ఇటీవలే సివిల్స్ పరీక్షలు రాయగా, ర్యాంకు సాధించలేకపోయాడు. అప్పటినుంచి కొంత మానసిక సంఘర్షణకు గురవుతున్న బల్వీందర్, మూడు రోజుల క్రితం కరీంనగర్ ఇంటికి చేరుకున్నాడు. మంగళవారం ఉదయం ఆరున్నర సమయంలో బల్వీందర్ తల్వార్‌తో తల్లిదండ్రులపై దాడికి యత్నించారు. వారు రోడ్డుపైకి పరుగులు తీశారు. వాళ్లను తరుముతూ వచ్చిన బల్వీందర్ రోడ్డు మీద దొరికినవాళ్లను దొరికినట్లు తల్వార్‌తో దాడి చేయడం ఆరంభించాడు. దాంతో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బల్వీందర్‌ను ఆపే ప్రయత్నం చేయగా, వారిపై తల్వార్‌తో దాడికి దిగడంతో వన్ టౌన్ సిఐ విజయసారథి సర్వీస్ రివాల్వర్‌తో కాల్చడంతో బల్వీందర్ కుప్పకూలాడు. వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బల్వీందర్ దాడిలో తల్లిదండ్రులు అవతార్‌సింగ్, సత్వంత్‌బేబికౌర్, హెడ్‌కానిస్టేబుల్ మల్లయ్య, కానిస్టేబుల్ మీర్ అలీ, ఆటో డ్రైవర్ శ్రీమన్నారాయణ, అల్వాల్‌కు చెందిన కీర్తన, ఆమె తండ్రి జయకర్, వినయ్‌కుమార్‌తోపాటు మరికొందరికి గాయలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బల్వీందర్‌సింగ్ మృతి చెందాడు. కాళ్లపై కాల్పులు జరిపి అదుపుచేయాల్సి ఉండగా, పక్కటెకముల భాగంలో కాల్పులు జరపడంతో చనిపోయాడని, కాల్పులు జరిపిన సిఐపై హత్య కేసు నమోదు చేయాలంటూ మృతుడి బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకోకుండా ఆసుపత్రిలో భారీగా పోలీసులు మోహరించారు. ఓఎస్డీ సుబ్బారాయుడు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. నగర మేయర్ రవీందర్‌సింగ్ ఆసుపత్రికి చేరుకుని ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చివరకు సాయంత్రం నిబంధనల ప్రకారం టీమ్ ఆఫ్ డాక్టర్ల బృందంతో శవ పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. బల్వీందర్ తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం.. కాల్పుల్లో మృతి చెందిన బల్వీందర్‌సింగ్