కరీంనగర్

ఉద్యమంలా ఇంకుడు గుంతలు నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 17: రాబోయే తరానికి నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇంకుడు గుంతల నిర్మాణాలు ఒక ఉద్యమంలా చేపట్టాలని నగర మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం చైతన్యపురిలోని సప్తగిరి రెసిడెన్సీలో నిర్మించనున్న ఇంకుడు గుంతకు మేయర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు తాగునీటికి అనేక అవస్థలు పడుతున్నారని, లాతూర్‌లో లాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఏర్పడకుండా ఉండాలంటే ప్రజలందరు విధిగా ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు బండి సంజయ్, కర్రె లింగయ్య, సప్తగిరి రెసిడెన్సీ అధ్యక్ష, కార్యదర్శులు సింహాచలం యతీందర్, కుమార స్వామితో పాటు మహేందర్, చంద్రశేఖర్, చారి, టిఆర్‌ఎస్ నాయకుడు చొప్పరి వేణు తదితరులు పాల్గొన్నారు. కాగా, నగరంలో నూతనంగా ఆవిర్భవించనున్న కరీంనగర్ రెయిన్ వాటర్ హార్వెస్టర్ క్లబ్‌కు బిల్డర్, ఇంజనీర్ హరికిషన్ 50 వేల చెక్కును మేయర్ ద్వారా అందజేశారు.