కరీంనగర్

నిర్లక్ష్య వైద్యంతో మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట, ఫిబ్రవరి 15: వివాహం జరిగిన రోజు, విధి ఆ కుటుంబాన్ని చిన్న చూపు చుసి ఆ మహిళను అనంత లోకాలకు తీసుకెళ్లడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. జమ్మికుంట పట్టణంలోని నగర పంచాయతీ సమీపంలోని ఆసుపత్రిలో నిర్లక్ష్యమైన వైద్యంతో మొదటి కాన్పుకు వచ్చిన ఒగ్గు రమ్య (20) అనే మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. బంధువులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు రమ్యకు ప్రసూతి కోసం తీసుకవచ్చి, పెద్ద ఆపరేషన్ చేయగా,కూతురును ప్రసవించింది. అనంతరం వైద్యం అందించి ఇంటికి పంపించారు. వారం రోజుల తర్వాత ఆపరేషన్ కుట్లు తీసేందుకు గురువారం ఆసుపత్రికి తీసుకవచ్చి, కుట్లు విప్పిన తర్వాత ఇంటికి పంపించిన వెంటనే మహిళ కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకవచ్చారు. వైద్యం అందింస్తుండగానే మృతి చెందిందని, బంధువులు, గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. వైద్యలు ఎలా జరిగిందని బంధువులు ప్రశ్నించినా కారణం తెలుపడం లేదని ఆగ్రహం చేశారు. వైద్యుని నిర్లక్ష్యమైన సమాధానంతో బంధువులు తీవ్ర ఆందోళన నిర్వహించి, ఆసుపత్రి అద్దాలు పగులగొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. మహిళ మృతిపై ఆందోళన కొనసాగుతుంది.

11 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు
మంథని, ఫిబ్రవరి 15: మంథని మండలం విలోచవరంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను మంథని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. విలోచవరం గోదావరి తీరం వైల్డ్ లైఫ్ వన్యప్రాణుల సంరక్షణ విభాగంలోని ఇసుకను అక్రమంగా తీస్తు దొడ్డి దారినా లక్షలు సంపాదిస్తున్న ఇసుక మాఫియాను మంథని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో రెవెన్యూ పోలీస్ శాఖ సహయ సహకారాలతో పట్టుకున్నారు. మంథని రేంజ్ ఆఫీసర్‌కు విలోచవరంలో అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారని సమాచారం రావడంతో రేంజ్ ఆఫీసర్ డీఆర్‌వోమల్లయ్య, ఎఫ్‌బీవో వాయుకుమార్, ఏబివో శ్రీనివాస్‌లు మంథని రెవెన్యూ సిబ్బంది, పోలీస్‌లతోవిలోచవరంలోని గోదావరి తీరానికి వెళ్లగా అక్కడి నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న పదకొండు ట్రాక్టర్లను, ఒక్క జేసిబిని అటవి శాఖ అధికారులు పట్టుకొని ఫారెస్టుకార్యాలయానికి తరలించారు. 11 మంది ట్రాక్టర్ల యజమానులపై, జేసిబి యజమాపిపై కేసు నమేదు చేసినట్టు ఫారెస్టు అధికారులు తెలిపారు.

స్మార్ట్‌సిటీ పనులపై కమీషనర్ శశాంక సమీక్ష
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 15: స్మార్ట్‌సిటీ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొనసాగే స్మార్ట్‌సిటీ పనులపై మున్సిపల్ కమిషనర్ కె.శశాంక గురువారం సమీక్షించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో పనులు చేపట్టే ఆర్వీ కన్సల్టెన్సీ బృందంతోపాటు మున్సిపల్ అధికారులతో నిర్వహించిన ఈ సమీక్షలోమొదటి దశలో చేపట్టే ప్రాజెక్టు పనులపై సుదీర్ఘంగా చర్చించారు. కన్సల్టెన్సీకి చెందిన అర్భన్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ విభాగాలకు సంబంధించిన నిపుణులు రూపొందించిన డిజైనింగ్‌పై వీడియో కాన్ఫరెన్స్ హాలులో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించి, సూచనలు చేశారు. నగరంలో మొదటగా పరిగణలోకి తీసుకుని అభివృద్ధి చేసే స్మార్ట్ రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్, టవర్ సర్కిల్ ఏరియా అభివృద్ధి, అండర్ కేబుల్ నెట్‌వర్కింగ్, పలు డివిజన్‌ల పార్కుల అభివృద్ధి, మార్కెట్ యార్డు రిడిజైనింగ్, మల్టీపర్పస్ స్కూల్, సర్కస్ గ్రౌండ్, రివర్ ఫ్రంట్, ఐలాండ్స్, జంక్షన్స్, కమాండ్ కంట్రోల్ ,తదితర ప్రాజెక్టు పనుల డిజైనింగ్‌పై కమీషనర్‌కు వివరించారు. స్మార్ట్‌సిటీలో చేపట్టబోయే ప్రతి ప్రాజెక్టు డిజైనింగ్ చేసి, ప్రాజెక్టుల వారీగా నిధుల కేటాయింపు వివరాలు అందజేయాలని కన్సల్టెన్సీ బృందాన్ని కోరారు. స్మార్ట్ సిటీలో చేపట్టే ప్రాజెక్టు పనుల్లో భాగంగా నగర స్థానిక పరిస్థితుల వివరాలతోపాటు అధికారుల సలహాలు,సూచనలతోకన్సల్టెన్సీ బృందానికి సమాచారం అందజేయాలని కోరారు. స్మార్ట్‌సిటీ పనుల్లోకూడా అధికారుల పర్యవేక్షణ తప్పనిసరని అన్నారు. ఇందులోభాగంగా బల్దియాకు చెందిన ఎస్‌ఈ, ఈఈ, డీఈ, ఏఈ, తదితర అధికారులతో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులను నియమించారు. 20రోజుల్లోపు ప్రాజెక్టు పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసే విధంగా డిజైన్లు రూపొందించాలని కన్సల్టెన్సీ ప్రతినిధులను కోరారు. స్మార్ట్ సిటీ పనుల విజయవంతం కోసం నియమించిన మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈసమావేశంలో ఆర్వీ కన్సల్టెన్సీకిచెందిన ప్రాజెక్టుల నిపుణులు, బృందం ప్రతినిధులు, బల్దియా సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.