కరీంనగర్

చిన్నారి మృతికి కారణాలు తెలపాలంటూ ఆందోళన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లందకుంట, ఫిబ్రవరి 15: ఇల్లందకుంట మండలంలోని అజయ్-హారిక దంపతుల కూమార్తె అవంతిక ఇంజక్షన్ వికటించి గత ఐదు నెలల క్రితం మృతి చెందింది. దాదాపు ఐదు నెలలు కావస్తున్నా బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని గురువారం కుటుంబ సభ్యులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా చిన్నారి తండ్రి అజయ్ మాట్లాడుతూ కూతురు చనిపోయిన తరువాత జిల్లా స్థాయి అధికారులతో పాటు ఢిల్లీ నుండి వైద్య బృందాలు వచ్చి నివేధికలు రాసుకొని వెళ్లడం తప్ప ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. అధికారులను అడిగితే రిపోర్టులు రాలేదని చేతులు దులుపుకుంటున్నారని ఆవేదనను వ్యక్తం చేశాడు. న్యాయం జరిగేంతవరకు న్యాయ పోరాటం చేస్తామని, అధికారులు ఇదేతీరుగా ఉంటే పురుగుల మందు తాగి చచ్చిపోతామని హెచ్చరించారు. చిన్నారి మృతికి కారణమైన వారిని తప్పించేందుకు అధికారులు నామమాత్రంగా బదిలీలు చేశారన్నారు. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారి రాజేశం వివరణ ఇస్తూ మృతి తరువాత పూర్తి స్ధాయిలో విచారణ చేయడం జరిగిందని, ఆ నివేదికను ఉన్నతస్ధాయి అధికారులకు పంపించినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా భాద్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలి
* దేవస్థానం చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి
ధర్మపురి, ఫిబ్రవరి 15: దక్షిణకాశీగా పేరొందని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పక్షాన ఫిబ్రవరి 26నుండి మార్చి 10వరకు వైభవోపేతంగా నిర్వహించనున్న శ్రీయోగానంద, ఉగ్ర నారసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలని దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి కోరారు. గురువారం దేవస్థాన సమావేశ మందిరంలో ఎసి,ఇఓ నాయిని సుప్రియ నిర్వహించిన ధర్మకర్తల మండలి సమావేశంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, అర్చకులు, సిబ్బంది, స్వచ్చంద సేవకుల సమన్వయంతో ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా ఉత్సవాలు నిర్వహించాలని శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. పాతికేళ్ళ అనంతరం ధర్మపురి క్షేత్రానికి బ్రహోత్సవాల ప్రారంభ దినాన రానున్న త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామికి సాంప్రదాయ ఘన స్వాగతం పలికి, వలసిన ఏర్పాట్లు ఘనంగా చేయాలని నిర్ణయించారు. అలాగే జాతర సందర్భంగా అన్ని రోజులు రైస్‌మిల్లర్లు, వైశ్య, వర్తక, వివిధ కుల సంఘాలు సహకారంతో దేవస్థాన ధర్మకర్తల మండలిచే నిత్యాన్న దానం నిర్వహించాలని తీర్మానించారు. ధర్మకర్తలు వేంకటేశ్వర్‌రావు, భాగ్యలక్ష్మి, రమాదేవి, గంగాధర్, రాజన్న, సునిల్‌కుమార్, లింగన్న, శ్రీనివాస్, తిరుపతి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.