కరీంనగర్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను తక్షణం పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, ఫిబ్రవరి 15: ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల వారికి సంబంధించి జిల్లాలో నమోదైన కేసుల వివరాలు, ఆకేసులలో ఎన్నింటిని పరిష్కరించారు, ఎన్ని కేసులలో డబ్బులు అందించారనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 60కేసులు నమోదుకాగా ఇప్పటి వరకు మొత్తం రూ. 29,02,000 ప్రభుత్వ మార్గనిర్ధేశాల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు అందజేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈసంవత్సరంలో పెద్దపల్లి ఏసీపీ పరిధిలో 31కేసులు నమోదు కాగా, అందులో 12కేసులు పాల్స్ కేసులని, 3 కేసులు హైకోర్డులో స్టే ఆర్డర్‌లో ఉన్నాయని, మిగిలిన కేసులను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. వీటికి సంబంధించిన రిపోర్డు కమిటీ సభ్యులకు అందరికి కాపీలు అందజేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వారికి రాజ్యాంగపరంగా లభించిన హక్కులను పరిరక్షించడానికి ఈకమిటీ ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కలిగి ఉండాలని, కులం పేరుతో ఎవరిని కించపర్చకూడదనే ఉద్దేశ్యంతో రాజ్యాంగం కల్పించిన హక్కులను జిల్లా యంత్రాంగం కాపాడాలని, ఎస్సీ ఎస్టీల సంక్షేమ అభివృద్దికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. ఈసమావేశంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య, జిల్లా ఇన్‌చార్జి డిఆర్వో పద్మయ్య, పెద్దపల్లి ఆర్డీవో అశోక్‌కుమార్, పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్, గోదావరిఖని ఏసీపీ అపూర్వరావు, జిల్లా ఇన్‌చార్జి డిఆర్డీవో ప్రేమ్‌కుమార్, జిల్లా ఎస్సీ అభివృద్ది అధికారి మొగులయ్య, ఈడీ ఎస్సీ కార్పోరేషన్ భూమన్న, జిల్లా వ్యవసాయాధికారి తిరుమల్ ప్రసాద్, జిల్లా పశుసంవర్థక అధికారి రాజన్న, జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసీటి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.