కరీంనగర్

ఎన్నికలు జరిగే వరకూ ప్రత్యేకాధికారిని నియమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఫిబ్రవరి 18: సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు వెంటనే జరుపాలని, అప్పటి వరకు ప్రభుత్వ అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరపాలన్న పోరాటంలో భాగంగా స్థానిక కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన అఖిలపక్షం నేతలు ఆదివారం మూడవ రోజు సందర్భంగా శిబిరంలో ‘చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన’ తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ అర్బన్ బ్యాంకుకు జాయింట్ కలెక్టర్ ప్రత్యేకాధికారిగా నియమించారని, ప్రభుత్వం వివక్ష మాని ఇక్కడ కూడా అలాగే నియమించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ అర్బన్ బ్యాంక్‌పై ప్రజల నిరసనను గమనించకపోవడం దారుణమని, తమ పార్టీ వారు కనుక ఎన్నికలు లేకుండా కమిటీ పదవీ కాలాన్ని పొడగించుకోవడం సరి కాదని, సహకార స్ఫూర్తికి ఇది విరుద్ధమని నేతలు విమర్శించారు. బ్యాంక్ సీఈవో పత్తిపాక శ్రీనివాస్ పాలకవర్గంకు వత్తాసు పలుకడం దారుణమని పేర్కొన్నారు. కాగా ఆదివారం దీక్షలు చేపట్టిన వారిలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు, కొంపెల్లి శివశంకర్, బోగ వెంకటేశం, జక్కని ప్రభాకర్, వేముల పోశెట్టిలు పాల్గొనగా, ఏఐటీయూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, సామల మల్లేశం, అర్బన్ బ్యాంక్ మాజీ ఉపాధ్యక్షులు దొంత దేవదాస్, నీలి రవీందర్, పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు వేముల శ్రీనివాస్, కుసుమ గణేశ్, మ్యాన చంద్రశేఖర్, దూస రమేశ్ సంఘీభావం ప్రకటించారు.

ఓపెన్ స్కూల్ తరగతులను పరిశీలించిన రాష్ట్ర బృందం
ముకరంపుర కరీంనగర్, ఫిబ్రవరి 18: కరీంనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (పురాతన) నందు ఓపెన్ స్కూల్ 10 వ తరగతి, ఇంటర్ తరగతులను రాష్ట్ర బృందం ఆదివారం పరిశీలించింది. రాష్ర ఓపెన్ స్కూల్ సొసైటీ హైదరాబాద్ నుండి పరిశీలకులు బోయినిపల్లి వెంకటేశ్వర్ రావు సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలని, పరిక్షఫీజులను ఈ నెల 20వ తేదిలోపు చెల్లించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఇవో వెంకటేశ్వర్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓపెన్ స్కూల్ కో అర్డినేటర్ తోట రాజయ్య, కరీంనగర్ ఎం ఇ వో మోహన్, సుబాన్ సిద్దిఖీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.