కరీంనగర్

నభూతో నభవిష్యత్..వెంకన్న బ్రహ్మోత్సవ సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 18: దేవ దేవుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కరీంనగర్‌లోనే తొలిసారిగా నభూతో నభవిష్యత్ అన్న రీతిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో పాలక మండలి ఆధ్వర్యంలో నగర నడిబొడ్డులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవరోజు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా, ఆద్యయనోత్సవ విశిష్టతను, వేద పారాయణాన్ని, బ్రహ్మోత్సవాల చరిత్రను వేదాంత పండితులు నమిలికొండ రాజగోపాలాచార్యులు భక్తులకు వివరించారు. ఆరాధన, ప్రాబోధకి, దివ్యప్రబంధ పారాయణం జరిగింది. విష్ణు సహస్రనామ పారాయణం, పరమపదోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని నాద నీరాజనం వేదికపైన వేములవాడ సాంస్కృతిక పాఠశాల గాయని రాధిక, శాస్త్ర భజన మండలి బృందం, శభరిమాత భజన మండలి బృందం ఆలపించిన స్వామివారి కీర్తనలు, భజనలు, పాటలు అందరినీ అలరించాయి. రతన్‌కుమార్ శిష్య బృందం ప్రదర్శించిన ఆలయ నృత్యం, పేరిణీ నాట్యం, శ్రీకుమారి లలితా ప్రసాద్, పురాణం శితికంఠ శౌరిల అన్నమాచార్య సంకీర్తనలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. కళా ప్రదర్శనలకు వాయిధ్య సహకారాన్ని బెజ్జంకి రాధాకృష్ణ, శ్రీరాముల మధు, మోహన స్వామి, రామయ్య శర్మ, వరాల వెంకన్న, శ్రీరాముల రాము అందించగా, అనంతాచార్య, గోపాల్‌లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చకిలం ఆగయ్య, ఆలయ ఇఓ కిషన్‌రావు, పాలక మండలి సభ్యులు గోగుల ప్రసాద్, వాసం రామలింగం, కంసాల దేవత, గంప రమేష్, తిప్పబత్తిని రవీందర్, విద్యాసాగర్, గిద్దెపెరుమాండ్ల స్వామి ఆలయ చైర్మన్ కలర్ సత్తన్న, ఆలయ అర్చకులు నాగరాజాచార్యులు, ఆదినారాయణచార్యులు, మదుసూధనాస్వామిలతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.