కరీంనగర్

కుల సంఘాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 18: కులసంఘాల సంక్షేమానికి, వారి అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం సీతారాంపూర్‌లో కరీంనగర్ జిల్లా పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ ఎసీ పంక్షన్ హల్‌ను ఎమ్మెల్యే గంగుల, మాజీ ఎంపీ సుధారాణిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లను విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. కులసంఘాలకు చేయుతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. చేనేత కార్మికులకు కేసీఆర్ భారీగా నిధులు కేటాయిస్తున్నారని మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి అన్నారు. భావితరాలకు ఉపయోగపడేలా విద్యార్థులు తయారు కావాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమాలకర్ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా పద్మశాలి సంఘం భవనానికి తనవంతు సహకారం అందిస్తానని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గుగ్గిల్ల రమేష్, గ్రంథాలయ చైర్మన్ రవీంధర్, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.