కరీంనగర్

అధికార టీఆర్‌ఎస్ పార్టీకి షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 18: కరీంనగర్ కార్పొరేషన్‌లో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 12వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత కార్పొరేటర్ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఆమె భర్త మాజీ కౌన్సిలర్ మెండి చంద్రశేఖర్ కూడా టీఆర్‌ఎస్ పార్టీకి రాజినామా చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శ్రీలత మాట్లాడుతూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తమను చిన్న చూపు చూడడం, అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఓ భూ వివాదంలో తన భర్త చంద్రశేఖర్‌ను ఎమ్మెల్యే పోలీస్ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఎమ్మెల్యే వేదింపులు ఆపకపోతే ఆయన ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని శ్రీలత హెచ్చరించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు, సీఏం కేసీఆర్‌కు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ మెండి చంద్రశేఖర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

సంచార జాతులకు ప్రభుత్వం పెద్దపీట
* పూసల కులస్థుల భవన నిర్మాణానికి రూ.10లక్షలు * ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
పెద్దపల్లి, ఫిబ్రవరి 18: గ్రామీణ నాగరికలో భాగంగా అలంకృత వస్తువులను విక్రయిస్తూ జీవనం సాగిస్తూ సమాజానికి నవ నాగరికతను నేర్పిన పూసల కులానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో రూ.50లక్షలతో నిర్మించతలపెట్టిన పూసల భవన నిర్మాణం కోసం ఆధివారం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంబిసీలకు, సంచార జాతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. అలాగే పూసల కులం మహిళలు గ్రామీణ ప్రాంతాలలో అలంకృత వస్తువులను విక్రయిస్తూ కాలం వెల్లదీసే వారి కోసం ఎంబీసీ కార్పొరేషన్ కింద ప్రత్యేక రుణాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. అలాగే పూసల కులస్థులకు సంఘ భవనం కోసం రూ.10లక్షలు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించే పూసాల భవనం ఆదర్శప్రాయంగా నిలవాలని ఆక్షాంక్షించారు. మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య మాట్లాడుతూ పూసల కుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు నిధుల నుండి రూ. 5లక్షలు ఇప్పిస్తానని, మున్సిపల్ రహదారుల అభివృద్ధిలో భాగంగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌తో పాటు కొత్తరోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటిపల్లు వెంకట్, కౌన్సిలర్ షాబీర్‌ఖాన్, పూసల సంఘం నాయకులు సత్యనారాయణ, గుడ్ల సమ్మయ్య, పొదిల కుమారస్వామి, నాగిశెట్టి శ్రీనివాస్, వెంకన్న, వెంకటేశం, సారయ్య, రాజయ్య పాల్గొన్నారు.