కరీంనగర్

నేతల చిత్ర పటాలతో మహిళల దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఫిబ్రవరి 20: జాతి పిత మహాత్ముడు, భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్.అంబేద్కర్, ఇతర జాతీయ నేతల చిత్రపటాలతో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ సిరిసిల్లలో మహిళలు రిలే నిరాహర దీక్షలు చేపట్టారు. పదవీ కాలం చెల్లిపోయి, దొడ్డిదారిన పదువుల్లో కొనసాగుతున్న సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ పాలకవర్గంను వెంటనే రద్దు చేసి, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం చేస్తున్న పోరాటంలో భాగంగా మంగళవారం మహిళలు దీక్షలు చేపట్టారు. ఈమేరకు అర్బన్ బ్యాంకు ఎన్నికల డిమాండ్‌పై చేస్తున్న పోరాటంలో అయిదవ రోజుకు రిలే నిరాహార దీక్షలు చేసుకోగా, కలెక్టరేట్ ముందు మహిళలు చేపట్టిన దీక్షలకు పలువురు నేతలు సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలను పద్మశాలి మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు, కాంగ్రెస్ నాయకురాలు కాముని వనిత దీక్షలు చేపట్టిన వారికి పూల మాలలు వేసి, శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా దీక్షలు చేపట్టిన వారిలో మచ్చ అనసూర్య, తన్నీరు ఈశ్వరవ్వ, సిరిసిమల్లె మంజుల, ఆడెపు భాగ్య, బల్ల సుషీల, సామల లావణ్యలు ఉన్నారు.

మిషన్ భగీరథ పనులు సత్వరమే పూర్తిచేయాలి
* మేయర్ రవీందర్‌సింగ్
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 20: నగరంలో మిషన్ భగీరథ అర్భన్ కార్యక్రమంలోభాగంగా చేపట్టిన పైప్‌లైన్ పనులు సత్వరమే పూర్తిచేయాలని మేయర్ రవీందర్‌సింగ్ గుత్తేదారులను ఆదేశించారు. నగరంలోచేపట్టిన పలు అభివృద్ధి పనుల్లోభాగంగా చేపట్టిన పలు నిర్మాణాలపై సంబంధితాధికారులు, గుత్తేదారులతో సోమవారం అంబేద్కర్ స్టేడియంలో సమావేశమయ్యారు. ఈసందర్భంగా వందకోట్ల పనులు, ఎల్ ఆర్ ఎస్, జనరల్ ఫండ్ నిధులతోకొనసాగుతున్న పనుల పురోగతిపై చర్చించారు. ఈసమావేశంలోప్రజారోగ్య శాఖాధికారులు, గుత్తేదారులు, కార్పోరేటర్లు కోడూరి రవీందర్‌గౌడ్, సాదవేణి శ్రీనివాస్, మున్సిపల్ ఈ ఈ మోహన్‌కుమార్, డి ఈ యాదగిరి, ఏ ఈ దేవెందర్‌లతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.