కరీంనగర్

దేశానికే ఆదర్శం సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంభీరావుపేట, ఫిబ్రవరి 20: వచ్చే మూడేళ్లలో దేశానికే ఆదర్శంగా సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం నిలుస్తుందని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం రాత్రి గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యువజన పథకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహకార సంఘాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల సెస్ పరిధిలోని పాత పోల్స్ డిప్లెస్ చేయడం, విద్యుత్ వైర్లు సక్రమంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవడానికి గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు సమావేశమై సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలన్నారు. 50 ఏండ్ల క్రితం ఏర్పాటు చేసిన సెస్ సహకార సంఘం ఇప్పటికీ కొనసాగుతుంది. లాభార్జన లేకుండా ప్రజలకు సేవలందిస్తుందన్నారు. ఇలాగే సహకార సంఘాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. దోపిడీ చేయని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంట్ ఉండదని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని, విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకుంటారని చెప్పిన కాంగ్రెస్ నాయకులకు చెంపపెట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి విద్యుత్ అందజేస్తుందన్నారు. మున్ముందు రోజుల్లో తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ను అమ్మే స్థితికి చేరుకుంటుందన్నారు. సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, గ్రామ సర్పంచ్ భానోతు సరస్వతి, ఎంపీపీ కమ్మరి గంగసాయవ్వ, జడ్పీటీసీ మల్లుగారి పద్మ, మార్కెట్ కమిటి చైర్మన్ సుతారి సంపూర్ణ, టీఆర్‌ఎస్ నాయకులు నర్సింగా రావు, చిక్కాల రామారావు, ఎంపీటీసీ, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కొమిరిశెట్టి లక్ష్మణ్, చెవుల మల్లేశం, దయాకర్ రావు, రాజారాం, మహబూబ్ అలీతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కలెక్టరేట్ ఎదుట బీఎంఎస్ ధర్నా
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 20: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోకార్మికులకు మొండిచేయి చూపిందని ఆరోపిస్తూ, భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లాశాఖ ఆధ్వర్యంలోమంగళవారం కలెక్టరేట్ ఎదుట బడ్జెట్ ప్రతులు దగ్ధం చేశారు. ప్రధానద్వారం ఎదుట ధర్నా చేపట్టి, నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆసంఘం జిల్లా అధ్యక్షుడు దోలిపాటి రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ, కార్మికుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుపై మూడేళ్ళ అనంతరం నిర్వహిస్తున్న ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ఐఎల్‌సీపై ఆలోచించాల్సి వస్తుందని అన్నారు. జాతీయ సంఘం పిలుపుతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా నిరసన తలపెడుతున్నట్లు పేర్కొన్నారు. బీడీ పరిశ్రమపై జీ ఎస్టీ విధించటంతోతెలంగాణలోని పది లక్షలమంది కార్మికులు వీధినపడే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోతాము చేసిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర మంత్రి వర్గ ఉపసంఘం కార్మికుల సంక్షేమంపై ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌చేశారు. అంగన్‌వాడీలకు గౌరవ వేతనం పెంచుతూ, వారికి సామాజిక భద్రత కల్పించాలని, ఈపిఎఫ్ పెన్షన్ రూ.1000నుంచి రూ.5వేలకు పెంచాలని, నష్టాలతో ఉన్న పిఎస్‌యుఎస్ ఆదుకొని, వెంటనే పునరుద్దరించాలని, ఆదాయపుపన్ను 5లక్షలకు పెంచాలని, అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు సామాజిక భద్రత నిధి రూ.2వేల కోట్లకు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ఒప్పంద కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, మత్య్సకార్మికుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌లు పరిష్కరించాలన్నారు. గంటకు పైగా చేపట్టిన ఈధర్నాలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అలువాల తిరుపతి, ఉపాధ్యక్షుడు న్యాలకొండ అనిల్‌రావు, నార్ల మునమ్మ, మద్దెల భార్గవ, దోబిల కిరణ్, గుంజేటి శివకుమార్, వి.చంద్రశేఖర్, ఇజ్జగిరి రాజన్నతోపాటు జిల్లా నలుమూలలనుంచి వచ్చిన కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు.