కరీంనగర్

సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 20: ఈ నెల 26న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే రైతు సదస్సులో పాల్గొంటున్న తరుణంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ కమీషనర్ జగన్‌మోహన్ రావు, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌లు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కలిసి జగన్‌మోహన్ రావు అంబేద్కర్ స్టేడియాన్ని సందర్శించి ఏర్పాట్లపై పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలను అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా తగిన బందోబస్తు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖను కోరారు. బారికేడ్లు, షామియానాలు ఏర్పాటు చేయాలని, రైతు సదస్సుకు వచ్చే రైతులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రావీణ్య, ఆర్‌అండ్‌బి ఇఇ రాఘవాచార్యులు, జేడీఏ శ్రీ్ధర్, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, సమాచార శాఖ డీడీ వెంకటేశ్వర్‌రావు, ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీర్ రాధాకిషన్ పాల్గొన్నారు.

ఏసీబీ వలలో వీఆర్‌ఓ
చందుర్తి, ఫిబ్రవరి 20: చందుర్తి మండలం సనుగుల గ్రామ విఆర్‌ఓ ఏడెల్లి రాములు వీఆర్‌ఓ మంగళవారం సాయంత్రం రైతు నుండి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఎసీబీ డీఎస్పీ కిరణ్ కుమార్ పట్టుకున్నారు. ఎసీబీ డీఎస్పీ కథనం ప్రకారం మండలంలోని సనుగుల గ్రామానికి చెందిన బూర్ల దేవయ్య, బూర్ల రవీందర్ తన పెద్దనాన్న బూర్ల ఎల్లయ్య మరణించగా అతని పేరుమీద ఉన్న వ్యవసాయ భూమిని విరాసత్ చేసేందుకు అతని సోదరులైన రాజయ్య, చిన్న మల్లయ్యలు కలిసి నవంబర్ 18న సనుగుల గ్రామంలో ఏర్పాటు చేసిన భూ ప్రక్షాళనలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనికోసం పలుమార్లు విరాసత్ చేయాలని తహశీల్దార్‌కు మొరపెట్టుకున్నా దరఖాస్తు దొరకడం లేదని చెబుతూ తిప్పించుకుంటున్నాడని, దీంతో విసుగు చెందిన దేవయ్య, చిన్నమల్లయ్యల కుమారులు రవీందర్, బూర్గు దేవయ్యలు ఎసీబీ అధికారులను ఆశ్రయించగా ఎసీబీ అధికారులు ఇచ్చిన రూ.10 వేలు ఆర్జీదారుల కుమారులైన రవీందర్, దేవయ్యలు విఆర్‌ఓ రాములుకు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడిలో ఎసీబీ సిఐలు వెంకటేశ్వర్లు, తిరుమల్, సంజీవ్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తిలో ఎసీబీ దాడులతో చందుర్తి, రుద్రంగి రెవెన్యూ అధికారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఆర్మీలో ఎక్కువ మంది ఎంపిక కావాలి
* మంచి ఉపాధి అవకాశాలు: కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్

కరీంనగర్, ఫిబ్రవరి 20: మే నెలలో వరంగల్ జిల్లాలో జరిగే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఉమ్మడి జిల్లా నుండి ఎక్కువ మంది యువతి, యువకులు ఎంపిక కావాలని జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ ఆకాంక్షించారు. ఆర్మీలో ఉమ్మడి జిల్లా నుండి ఎక్కువ మంది ఎంపికయ్యే విధంగా తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇండియన్ ఆర్మీలో ఉన్న వివిధ ట్రేడులలో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వాటిని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సు ఎక్కువ మంది ఎంపికయ్యేందుకు దోహద పడుతుందని అన్నారు. 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్, బిఎస్సీ నర్సింగ్, ఎల్‌ఎల్‌బి, ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేసిన వారు ఆర్మీలోని వివిధ విభాగాల్లో చేరవచ్చని తెలిపారు. అలాగే వారధిలో నమోదు చేసుకున్న అభ్యర్థులకు కూడా వారధి ద్వారా శిక్షణ ఇస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ అవగాహన సదస్సులో ఆర్మీ రిక్రూట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ పవర్ పూరి ఆర్మీలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలపై పవర్ ప్రెసెంటేషన్ ద్వారా పూర్తి స్థాయిలో వివరించారు. ఈ సదస్సులో ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి లెఫ్టినెంట్ కె.ప్రవీణ్‌కుమార్, వారధి సోసైటి కార్యదర్శి ఆంజనేయులు, సైనిక సంక్షేమ శాఖ సిబ్బంది, ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువత, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు, ఎన్‌సీసీ కేడెట్లు తదితరులు పాల్గొన్నారు.