కరీంనగర్

నగరంలో సంత్ గాడ్గె బాబా విగ్రహం ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర కరీంనగర్, ఫిబ్రవరి 23: కరీంనగర్ నగరంలో సంత్ గాడ్గె బాబా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని నగర మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. శుక్రవారం స్థానిక తెలంగాణ చౌక్‌లో ఘనంగా సంత్ గాడ్గె బాబా 143వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ మాట్లాడుతూ ప్రస్తుతం అమలవుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆనాడే గాడ్గె బాబా గ్రామ గ్రామాన ప్రవేశపెట్టి స్వతహాగా శుభ్రం చేశారన్నారు. మహారాష్టల్రో 141కి పైగా స్వచ్ఛంద సంస్థలు స్థాపించి గ్రామ గ్రామాన భిక్షాటన చేసి సంకీర్తనలతో పేద విద్యార్థులకు విద్యనభ్యసించాలని విద్యాసంస్థలు స్థాపించారని తెలిపారు. ఆయన చేసిన సేవలకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ముగ్ధుడై తన గురువుగా పేర్కొన్నారని అన్నారు. బాబా దేశంలోని పేద ప్రజల సంక్షేమానికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన స్పూర్తి నేటి తరానికి కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒయు జెఎసి కన్వీనర్ రాగల్ల గంగాధర్, బిసి సంఘ నాయకులు బిజిగిరి నవీన్, కొత్తకొండ శ్రీనివాస్, కంచెర్ల అనిల్ కుమార్, కొల్లూరి మల్లేష్ కుమార్, పాటకుల భూమయ్య, పొన్నాల సంపత్, కొల్లేటి నాగరాణి, పూసాల సంపత్ తదితరులు పాల్గొన్నారు.

టీఅర్‌ఎస్ పార్టీ నాయకులకే సబ్సిడీ ట్రాక్టర్లు
* బిజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణరెడ్డి
జమ్మికుంట, ఫిబ్రవరి 23: టిఅర్‌ఎస్ పార్టీ నాయకులకు,బోగస్ రైతు పేర్లతో ప్రభుత్వం సబ్సిడి ట్రాక్టర్లు ఇస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణరెడ్డి అరోపించారు. శుక్రవారం జమ్మికుంట పట్టణంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణరెడ్డి,జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఒక్క ఎకరం ఎండి పోకుండా,రబీకి సాగునీరందిస్తామన్నప్రభుత్వం, పంటలు ఎండిపోతున్న పట్టించుకోవడం లేదన్నారు.రైతులు రెక్కలు ముక్కలు చేసుకోని వేసుకున్న పంటలకు ఎవరు భాధ్యత అని ప్రశ్నించారు. సంతలో పశువులను కోనుగోలు చేసినట్లు , ఇతర పార్టీల నాయకలకు ప్రలోభాలతో కోనుగోలు చేస్తున్నారన్నారు. ఎల్ ఎం డి నీళ్ళు ,సిద్దిపేటకు హరీష్‌రావు తరలించుకపోతుంటే, కరీంనగర్ జిల్లా మంత్రి ఈటల రాజేందర్ ఎం చేస్తున్నరని ప్రశ్నించారు.రైతు సమన్వయ సమితిలో ఆ పార్టీ రాజకీయ నాయకులు,రైతులు కానీవారి కమీటిలో ఎర్పాటు చేస్తు,రాజకీయ లబ్దిని పోందలని ప్రభుత్వ చూస్తుందన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటు,నష్టపోయిన రైతులకు బోనసు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు ఎర్రబెల్లి సంపత్‌రావు,కనుమల్ల గణపతి, అకుల రాజేందర్,గూడూరి శ్రీనివాస్‌రెడ్డి,జీడి మల్లేష్,తోపాటు పాల్గొన్నారు.