కరీంనగర్

ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామడుగు, ఫిబ్రవరి 23: గతంలో దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు జరిగితే వాటికి ఆధారాలు లభించేవి కావని, ప్రస్తుతం వచ్చిన నూతన టెక్నాలజీతో జరిగిన సంఘటన క్షణాల్లో దొరికిపోతుందని, ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే వంద మంది పోలీసులతో సమానమని కరీంనగర్ రూరల్ ఎసీపీ ఉషారాణి పేర్కొన్నారు. రామడుగు గ్రామస్థులు ‘నేను సైతం’లో భాగంగా అందజేసిన రెండు లక్షల 25 వేలతో కొనుగోలుచేసిన 11 కెమెరాలు శుక్రవారం ఎసీపీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారన్నారు. రోగాల భారిన పడి మరణించేవారికన్నా ప్రమాదాల ద్వారానే ఎక్కువగా మరణిస్తున్నారన్నారు. యువతీ, యువకులు ప్రేమ అనే పేరుతో ఆకర్షితులై క్షణిక నిర్ణయాలు తీసుకుంటూ కుటుంబంలో బాధలు నింపుతున్నారని, వీరిపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచి పిల్లలు చెడు మార్గంలో ప్రయాణించకుండా నిరోదించాలన్నారు. ఈ సందర్భంగా కెమెరాలకు విరాళం అందించిన వారిని సన్మానించారు. గ్రామ ఉపసర్పంచ్ కడారి వీరయ్య, వార్డు సభ్యుడు ఐతరవేని శ్రీనివాస్, స్థానిక పెట్రోల్ బంక్ యజమాని మరిన్ని సీసీ కెమెరాల కోసం 20 వేల రూపాయలు అందించారు. ఇదిలా ఉండగా పెట్రోల్ బంక్ యజమాని గతంలో సీసీ కెమెరాల కోసం ఇచ్చిన లక్ష రూపాయలు ఏమయ్యాయో విచారణ జరిపించాలని వార్డు సభ్యుడు ఐతరవేని శ్రీనివాస్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి సిఐ రమేష్, ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, తహశీల్దార్ ముజీబ్ అహ్మద్, ఎస్‌ఐ నరేష్ రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు వీర్ల వెంకటేశ్వర్ రావు, ఒంటెల మురళీకృష్ణా రెడ్డి, వీడీసీ చైర్మన్ మామిడి తిరుపతి తదితరులు ఉన్నారు.

మహిళల భద్రత బాధ్యత మాదే
* షీ టీం అవగాహన సదస్సులో డీఎస్పీ నరహరి * షీ టీ పోస్టర్లను ఆవిష్కరించిన జేసీ, అధికారులు
సిరిసిల్ల, ఫిబ్రవరి 23: మహిళల భద్రత తమ బాధ్యత అని సిరిసిల్ల స్పెషల్ బ్రాంచి డీఎస్పీ నరహరి పిలుపునిచ్చారు. శుక్రవారం మహిళలకు, విద్యార్థినిలకు షీ టీం బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యాస్మిన్ బాషా, జిల్లా మహిళ, శిశు సంక్షేమ అధికారి ఎం.సరస్వతిలు పాల్గొని అధికారులతో కలిసి షీ టీం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరహరి మాట్లాడతూ షీం టీం పనితీరుతో చెప్పుతో తగిన స్థాయిలో ఆకతాయిల ఆట కట్టించామన్నారు. గడిచిన కొన్ని రోజుల్లో వెయ్యి మంది పైచిలుకు ఆకతాయిలకు కౌన్సిలింగ్ నిర్వంచామన్నారు. షీ టీంలు రద్దీ ప్రాంతాలలో మఫ్టీలో నిఘాలో ఉంటారని, ఎక్కడైనా స్ర్తిలు, విద్యార్థినిలు పట్ల ఇబ్బందికి గురైతే షీటీంలు, వీడియోలు, ఫోటోల అధారాలతో సహా అదపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహస్తున్నామన్నారు. మళ్ళీ అలాగే ఆకతాయిలు ప్రవర్తిస్తే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. షీ టీంకు ఫిర్యాదు చేయాలంటే డయల్ 100 కానీ, 8331940670 నెంబరుకు కానీ లేదా జిల్లా అంతటా ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టె ద్వారా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఎవరికీ ఎలాంటి వేదింపులు ఉన్నా ముందుకు వచ్చి తమకు తెలియ చేయాలని, తాము మీకోసం ఉన్నామని, మీకు సేవలు అందించేందుకే ఉన్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీ ఎస్పీ వెంకటరమణ, సీ ఐ శ్రీనివాస్‌రావు, షీ టీం ఎస్సై మురళి, ఏ ఎస్సై సోనా, శ్రావణి, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాల్స్ వెంకన్న, జగన్‌గౌడ్, దిడ్డి శ్రీనివాస్, గెంట్యాల భూమేశ్, స్పెషల్ బ్రాంచి ఇన్సిపెక్టర్ సురేశ్, అధికారులు పాల్గొన్నారు.