కరీంనగర్

వ్యవసాయం చేసే ప్రతీ రైతుకు పెట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధర, ఫిబ్రవరి 23: పంటలు సాగు చేసే ప్రతీ రైతుకు ఎకరాకు పంటకు నాలుగు వేల పెట్టుబడి అందించడం జరుగుతుందని ఎంపి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయి రైతు సమన్వయ సమితి సభ్యులకు ఉత్తర తెలంగాణ స్థాయి సదస్సును 26న కరీంనగర్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని, సదస్సును వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారని ఆయన తెలిపారు. కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని రైతు సమన్వయ సమితి సభ్యులకు ముఖాముఖి చర్చావేదికతో పాటు పెట్టుబడి సాయం, శాస్తవ్రేత్తల సలహాలు ఉంటాయన్నారు. రైతు సమన్వయ సమితిని కార్పోరేషన్‌గా ముఖ్యమంత్రి ప్రకటించారని, రోహిణికార్తి ఆరంభంలో దుక్కి దున్ని విత్తనం నాటిన నుండి పంట అమ్మేవరకు కార్పొరేషన్ రైతులకు వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌తో పాటు రైతుల పంటల మద్ధతు ధరలు పడిపోయే సమయంలో వెయ్యి కోట్లతో ఏర్పాటు చేసే కార్పొరేషన్ రైతులకు అండగా ఉంటుందన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు గాను 17 వేల కోట్ల రుణమాఫీతో పాటు దేశంలోనే మొదటిసారి హెక్టార్‌కు 20 వేల ఇన్‌ఫుట్ గ్రాంట్ అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. భూ ప్రక్షాళన కార్యక్రమం 97 శాతం పూర్తయిందని, మార్చి 11న రైతులకు నూతన పట్టాదారు పాస్ బుక్కులు అందించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇన్‌ఫుట్ గ్రాంట్ రైతులకు అందించేందుకు గాను ఏడు వేల కోట్ల రూపాయలను బ్యాంకులలో అందుబాటులో ఉంచేందుకు గాను కేంద్ర ఆర్థిక మంత్రితో మాట్లాడడం జరిగిందని ఆయన తెలిపారు. త్వరలోనే రాష్ట్రానికి టఫె ట్రాక్టర్ కంపెనీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, వ్యవసాయానికి అనుబంధంగా ప్రతీ నియోజకవర్గంలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయడంతో నిరుద్యోగులకు ఉపాధితో పాటు రైతుల పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కలుగుతుందన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న మాదిరిగానే త్వరలోనే నీళ్లు ఇచ్చి చూపిస్తామని ఆయన అన్నారు. ఎమ్మెల్యే బొడిగ శోభ మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న రైతు సమన్వయ సదస్సుకు రవాణా, భోజన వసతి ఏర్పాటు చేస్తున్నామని, రైతు సమన్వయ సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎంపీపీ దూలం బాలాగౌడ్, జడ్పీటీసీ ఆకుల శ్రీలత, మార్కెట్ కమిటి చైర్మన్ రేండ్ల పద్మ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పుల్కం గంగన్న, టిఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అద్యక్షుడు సుంకె రవిశంకర్, మండల పార్టీ అద్యక్షుడు గుజ్జుల బాపురెడ్డి, మాజీ జెడ్పీటీసీ సత్తు కనుకయ్య, తహశీల్దార్ రాజేశ్వరి పాల్గొన్నారు.

జిల్లా రైతు సమన్వయ సమితీల ఫ్రకటన

కరీంనగర్, ఫిబ్రవరి 23: రాష్ట్రంలోని 30 జిల్లాల్లో రైతు సమన్వయ సమితీల జిల్లా సమన్వయకర్తలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ జిల్లా సమన్వయకర్తగా గుండెల్లి తిరుపతి, రాజన్న సిరిసిల్ల జిల్లా సమన్వయకర్తగా గడ్డం నర్సయ్య, పెద్దపల్లి జిల్లా సమన్వయకర్తగా కోట రాంరెడ్డి, జగిత్యాల జిల్లా సమన్వయకర్తగా చీటి వెంకటరామారావులను నియమించింది. ఇందులో ఇద్దరు బీసీలు కాగా, మరో ఇద్దరు ఓసీలు. ఇప్పటికే గ్రామ, మండల రైతు సమన్వయ సమితీలు ఏర్పాటైన సంగతి తెలిసిందే.