క్రైమ్/లీగల్

విద్యుత్ వైర్లు తెగిపడి 21 గొర్రెల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మార్చి 4: సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామంలో విద్యుత్ లైన్లు తెగి పడి 21 గొర్రెలు దుర్మరణం చెందాయి. ఆదివారం సాయంత్రం జరిగిన విద్యుతాఘాతం ఉదంతంలో గొర్రెల మందపై విద్యుత్ వైర్లు తెగి పడడంతో మందలో ఉన్న మొత్తం గొర్రెలు మృత్యువాతకు గురయ్యాయి. సలంద్రి మల్లయ్యకు చెందిన గొర్రెలను పెద్దూరులోని పెల్లెలో ఏర్పాటు చేసుకున్న దొడ్డికి చుట్టూ రక్షణగా ఇనుప కంచె నిర్మించారు. అందులో గొర్రెలు సేద తీరుతున్న సమయంలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. పెద్దూరు సబ్ స్టేషన్ నుండి బోనాల రోడ్డులోని ట్రాన్స్‌ఫార్మర్‌కు వేసిన 32 కెవి.విద్యుత్ లైన్లపై ఒక పిట్ట వాలడంతో షార్ట్ సర్క్యూట్ అయి వైర్లు గొర్రెల మందపై పడినట్టు బాధితులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.90వేలు నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నట్టు గ్రామ పంచాయితీ ఉద్యోగి రమేశ్‌రావు తెలిపారు. ఈ విద్యుత్ లైన్లు సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ(సెస్)కు చెందినవి కాగా, గొర్రెల యజమాని సలంద్రి మల్లయ్యకు పరిహారం ఇవ్వాలని ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.