క్రైమ్/లీగల్

టీఆర్‌ఎస్ నేత దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంభీరావుపేట, మార్చి 7: ఎంపీటీసీ భర్త టీఆర్‌ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురయిన సంఘటన బుధవారం సాయంత్రం గంభీరావుపేట మండలంలో చొటుచేసుకుంది. మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు బీనవేణి చంద్రకళ భర్త దేవయ్య (42)ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. దేవయ్య ఇదే గ్రామంలోని విందుకు హాజరయి, అక్కడే వున్న ఫీల్డ్‌అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి, అతని కుమారుడు సందీప్‌లు గొడువపడ్డారు. దీంతో మాటామాటా పెరిగి హత్యకు దారితీసింది. సందీప్ కత్తితో దేవయ్యను అతి సున్నితమైన భాగాలపై బలంగా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి మృతుడు దేవయ్యకు గతంలో వివాదాలుండగా, ఆ వివాదాలే హత్యకు దారితీసినట్లుగా గ్రామస్థుల సమాచారం. ఎంపీటీసీ భర్త హత్యతో కొత్తపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. హత్య జరిగినట్లు తెలియగానే పెద్ద ఎత్తున ప్రజలు హత్య సంఘటన స్థలానికి తరలివచ్చారు. హత్య సంఘటనకు ఒక్క రోజు ముందు నుండే నిందితుడు పెద్ద కత్తికై గ్రామంలో వెతుకులాడినట్లు తెలిసింది. కక్షతో చేసిన హత్యని, తమకు న్యాయం జరిగే వరకు శవాన్ని పోస్టుమార్టంకు తరలించనివ్వమని సంబంధీకులు పట్టుబట్టారు. కులాల మధ్య చిచ్చురాజేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మృతుడు దేవయ్య టీఆర్‌ఎస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేశాడు. మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా వున్నాడు. హత్య సంఘటన తెలియగానే ఎల్లారెడ్డిపేట సిఐ రవీందర్, ఎఎస్సై జాఫర్ శరీఫ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, తల్లి తండ్రి వున్నారు. హత్య అనంతరం హత్య చేసిన నిందుతుడు పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తుంది.