క్రైమ్/లీగల్

కాశీలో జగిత్యాల వాసి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, మార్చి 7: జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన దువ్వాసి సుదర్శన్ (55) తల్లి ఆస్థికలను కాశీ గంగానదిలో కలిపేందుకు వెళ్లీ అక్కడ గుండెపోటుతో మృతి చెందాడు. గత పక్షం రోజులు క్రితం తన తల్లి అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి ఆస్థికలను కాశీలో కలిపేందుకు సోదరులతో కలిసి వెల్లిన సుదర్శన్‌కు మంగళవారం గుండెపోటు రావడంతో మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని జగిత్యాలకు తెప్పించేందుకు బుధవారం కాశీకి తరలివెల్లారు. కాగా దువ్వాసి సుదర్శన్ ప్రముఖ హాస్య నటుడు, నిర్మాత దువ్వాసి మోహన్‌కు స్వయాన సోదరుడు. ఇది వరకు సుదర్శన్ వస్త్ర వ్యాపారంతో పాటు ఫైనాన్స్ సంస్థలు నిర్వహించారు. సుదర్శన్ ఆకస్మిక మృతి పట్ల పట్టణంలోని అతని బంధువులు, వస్త్ర, వ్యాపార వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.