క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*్భర్యకు తీవ్ర గాయాలు
సుల్తానాబాద్, మార్చి 16: సుల్తానాబాద్ పట్టణంలోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎస్‌ఐ దేవేందర్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వీణవంక మండలం నర్సింహులపల్లి గ్రామానికి చెందిన రావణవేని శ్రీనివాస్-లక్ష్మి దంపతులు సుల్తానాబాద్ మండలంలోని పూసాల గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకల్లో పాల్గొని, తిరుగు ప్రయాణంలో గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తూ రాజీవ్ రహదారిపై పూసాల చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా పెద్దపల్లి నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రావణవేని శ్రీనివాస్, భార్య లక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే చికిత్సనిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ (43) చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడని, భార్య లక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

రోడ్డు ప్రమాదంలో కూతురు మృతి
* తండ్రికి గాయాలు
కరీంనగర్ రూరల్, మార్చి 16: కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కమాన్‌పూర్ వద్ద బైకును ట్రాక్టర్ ఢీకొట్టడంతో తాటికొండ ఆకాంక్ష (6) అనే బాలిక మృతి చెందగా తండ్రి తాటికొండ రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం కుటుంబంతో సహా తమ కూతురుకు వైద్యం కోసం కరీంనగర్‌కు వచ్చి వెళ్లుతుండగా కమాన్‌పూర్ వద్ద బ్రిక్స్ కంపెనీ ముందు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ మలుపుతిప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఎస్‌ఐ తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు..బైక్‌పై ముందు కూర్చున్న ఆకాంక్షకు, బైక్ నడుపుతున్న తాటికొండ రాజుకు తీవ్ర గాయాలు కాగా పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించగా చికిత్స పొందుతూ ఆకాంక్ష మృతి చెందిందని తాటికొండ రాజు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. భార్యకు, కొడుకుకు స్వల్ప గాయాలయ్యాయని, వీరు గంగాధర మండలం ఆసంపల్లికి చెందిన వారని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.