కరీంనగర్

సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మార్చి 17: సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని శనివారం రాత్రి తన పదవికి రాజీనామా సమర్పించారు. రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో మున్సిపల్ కార్యాలయానికి అధికార పార్టీ కౌన్సిలర్లతో కలిసి వెళ్ళి మేనేజర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. శనివారం మున్సిపల్ బడ్జెట్ సమావేశం ముగిసిన అనంతరం వివరాలను విలేఖరుల సమావేశంలో వెల్లడించిన సంధర్భంగా పనుల కమిషన్ల వ్యవహారంలో నోరు జారడంతో దానిపై రాద్ధాంతం జరిగింది. పార్టీలోని, ఇతర పార్టీలలోని ప్రత్యర్థులు సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలను ప్రచారం చేయడంతో పాటు మంత్రి కెటిఆర్ దృష్టి వరకు పరిస్థితి వెళ్లడంతో పావని రాజీనామాకు దారి తీసింది. కాగా శనివారం మధ్యాహ్నం నుండి చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సామల పావని మున్సిపల్ చైర్‌పర్సన్ పావనికి రాజీనామా సమర్పించారు. పట్టణంలో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాలలో సిరిసిల్ల పట్టణ అభివృద్ధిలో తనను భాగస్వాములు చేసి తనకు సహకరించిన మంత్రి కె.తారకరామారావుకు సహచర మున్సిపల్ కౌన్సిలర్లకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు తన రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. ఇది ఇలా వుండగా మీడియా సమావేశంలో పనుల్లో కమిషన్ల వ్యవహారంపై వస్తున్న ఆరోపణలపై చైర్‌పర్సన్‌ను వివరణ కోరగా ఆమె స్పందిస్తూ నోరు జారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల పట్టణానికి ఎన్ని కోట్లు వచ్చినా అందరు అసంతృప్తితోనే ఉన్నారన్నారు. ఒకే కాంట్రాక్టర్ ఒకే వార్డులో అన్ని పనులు చేస్తున్నాడని, ఈ స్థితిలో కాంట్రాక్టర్లు చేసిన పనులపై రెండు లేదా మూడు శాతం కౌన్సిలర్లకు కమిషన్లు ఇచ్చుకునే ఆనవాయితీ ఉందన్నారు. వార్డులో కౌన్సిలర్లు పనుల ప్రారంభంలో కొబ్బరికాయలు కొట్టడం నుండి పలు ఖర్చులు భరిస్తారని, వార్డు సమస్యల్లో తిరుగుతారన్నారు. అయితే కాంట్రాక్టర్లు ఇచ్చే రెండు లేదా మూడు శాతం కమిషన్లు ఇవ్వకుండా కమిషన్లు అడుగుతున్నారని బదనాం చేస్తున్నారని, పనులు జరిగినప్పుడు కమిషన్లు ఇచ్చే బాధ్యత కాంట్రాక్టరపై ఉండాలన్నారు. అలా కాకుండా దీనిని రాజకీయం చేసి కమిషన్లు అడుగుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. సిరిసిల్లకే కమిషన్ల వ్యవహారం పరిమితం కాదని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో జరుగుతున్నదన్నారు. తానూ వార్డు కౌన్సిలర్‌నేనని, అందరిలో తాను ఉంటానని, తాను రాజకీయ పనులు చూసుకుంటానని, పర్సంటేజీలు మా సార్(్భర్త) చూసుకుంటాడని పేర్కొంది. ఈ వివాదాస్పద వ్యాఖ్యల్లో మంత్రి పేరును కూడా చైర్‌పర్సన్ ప్రస్తావనకు తీసుకరావడం మరింత వివాదానికి దారి తీసింది. కాగా చైర్పర్సన్ రాజీనామా సమయంలో భర్త దేవదాస్‌తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు రాపెల్లి లక్ష్మినారాయణ, గుండ్లపల్లి పూర్ణచందర్, బింగి రామాంజనేయులు, రిక్కుమల్ల సంపత్, టిఆర్‌ఎస్ నాయకులు అన్నారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.