కరీంనగర్

బలహీన వర్గాల అభ్యున్నతికి మంత్రి ఈటల కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, మార్చి 20: బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎంతగానో కృషి చేస్తున్నారని జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. మంత్రి ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం మూఢపల్లి గ్రామంలో మృతుని కుటుంబాన్ని, కిష్టంపేట గ్రామంలో మృతురాలి కుటుంబాన్ని, జోగాపూర్ ఎంపీటీసీ కనుకయ్య కత్తిపోట్లకు గురికాగా వారిని పరామర్శించారు. కాగా రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మంత్రి ఈటల రాజేందర్‌కు వేములవాడ నియోజకవర్గ టీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు ఈర్లపల్లి రాజు పుష్పగుచ్చమిచ్చి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ
బోయినిపల్లి, మార్చి 20: బోయినిపల్లి పోలీస్ స్టేషన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సందర్శించారు. గత పది రోజుల క్రితం జిల్లా ఎస్పీగా నూతనంగా బాద్యతలు చేపట్టి పోలీస్ స్టేషన్ల సందర్శనలో భాగంగా మంగళవారం బోయినిపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఆయన వెంట వేములవాడ డీఎస్పీ చంద్రశేఖర్, వేములవాడ రూరల్ సిఐ రఘుచందర్, బోయినిపల్లి ఎస్‌ఐ వెంకటకృష్ణ తదితరులు ఉన్నారు.

ఘనంగా మంత్రి ఈటల జన్మదిన వేడుకలు
కరీంనగర్ టౌన్, మార్చి 20: రాష్ట్ర ఆర్ధిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ 55వ జన్మదిన వేడుకలు మంగళవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్, అనుబంధ విభాగాల నాయకులు పలుచోట్ల కేకులు కోసి, మిఠాయిలు పంచిపెట్టారు. పలు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఆస్పత్రుల్లో పాలు, పండ్లుపంపిణీ చేశారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా టీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్‌లు ద్యావ మధుసూధన్‌రెడ్డి, పొన్నం అనిల్‌ల ఆధ్వర్యంలో మంత్రి కార్యాలయంలో, తెలంగాణ చౌక్‌లో, ఎమ్మెల్యే కార్యాలయంలో కేకులు కోసి, మిఠాయిలు పంచారు. ఎమ్మెల్యే కార్యాలయంలోనిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కమలాకర్ మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి ప్రధాతగా మంత్రి ఈటల చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోనున్నాడని అన్నారు. ఈకార్యక్రమాల్లో టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు నాగరాజు, ఆంజనేయులు, చదువుకోమల్‌రెడ్డి, దూలం సంపత్, ఫహాద్, నేతికుంట రాకేశ్, హరీష్, బండ వేణు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా బీఎల్‌ఎఫ్ బైక్ ర్యాలీ
తిమ్మాపూర్, మార్చి 20: బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా రాబోయే ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాలలో బీఎల్‌ఎఫ్ అభ్యర్థులు పోటీ చేసే దానిలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన బీఎల్‌ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి వచ్చిన బీఎల్‌ఎఫ్ కార్యకర్తలు తిమ్మాపూర్ మండల కేంద్రం నుండి భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నల్ల సూర్యప్రకాశ్, రాష్ట్ర నాయకులు జి.రాములు, జి.నాగయ్య, మజీద్ ఉల్లాఖాన్, జిల్లా నాయకులు ముకుందరెడ్డి, మాతంగి శంకర్, మర్రి వెంకటస్వామి, వర్ణ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.