కరీంనగర్

అతి వేగం, నిర్లక్ష్యం, మద్యం వల్లే రోడ్డు ప్రమాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ రూరల్, మార్చి 20: అతివేగం, నిర్లక్ష్యంగా, మద్యం సేవించి వాహనాలు నడుపడం వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కరీంనగర్ సీపీ వి.బి.కమలాసన్ రెడ్డి అన్నారు. మంగళవారం వరల్డ్ హెడ్ ఇంజూర్ డేస్ సందర్భంగా అపోలో ఆసుపత్రి వారు నిర్వహించిన బైక్ ర్యాలీని సీపీ కమలాసన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని, కారు ఇతర రకాల వాహనాల్లో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ధరిస్తే రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించవచ్చని అన్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగడానికి కారణం కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడమే అన్నారు. గత మూడు సంవత్సరాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిందన్నారు. ఎక్కువగా తలకు గాయాలయి మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. తలకు రక్షణ కోసం హెల్మెట్ వినియోగించాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారు ఇప్పటికే చాలా మంది జీవచ్ఛవాల్లా మారారని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో నివారణకు రక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఎసీపీ ఉషారాణి, ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి, అపోలో ఆసుపత్రి అదికారి బాబురావు, నరేష్, వైద్యులు కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు
కమీషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ చర్యల దృష్ట్యా ఈ నియమ నిబంధనలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

సావిత్రి భాయి పూలే విగ్రహం ధ్వంసం
* గుర్తు తెలియని వ్యక్తుల దుశ్చర్య
కోనరావుపేట, మార్చి 20: కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో సావిత్రి భాయి పూలే విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మంగళవారం తెల్లవారు సమయంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సావిత్రి భాయి పూలే విగ్రహం తలలోని భాగాలను ధ్వంసం చేశారు. ఈనెల 17న ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రమేశ్‌బాబుల చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కరించగా, మూడు రోజులకు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి వెంకన్న ఆధ్వర్యంలో సుద్దాలలో ఆందోళన చేపట్టి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సర్పంచుల ఫోరం పక్షాన రశీద్, తిరుపతి, శ్రీనివాస్, మంజులలు సుద్దాల ఘటనను సందర్శించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. బడుగు బలహీన వర్గాల నాయకుల విగ్రహాలను కూల్చివేయడం దుశ్చర్య అని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శిక్షించాలని డిమాండ్ చేశారు.

అభివృద్ధి పనులు పరిశీలించిన మేయర్
కరీంనగర్ టౌన్, మార్చి 20: నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మేయర్ రవీందర్‌సింగ్ కమీషనర్ కె.శశాంకతో కలిసి మంగళవారం పరిశీలించారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనున్న మల్టీపర్పస్ స్కూల్ ఆవరణను, నూతన ప్రహరీగోడ నిర్మాణాన్ని పరిశీలించారు. గుత్తేదారులు, అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి డిజైన్, ఎస్టిమేషన్, తదితరాలపై చర్చించారు. మెజర్‌మెంట్ అంశాలు పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో 15వ డివిజన్ కార్పోరేటర్ వాల రమణారావు, ఈఈ మోహన్, ఏఈ చైతన్య, తదితరులు పాల్గొన్నారు.