కరీంనగర్

‘పెన్షన్’పై పెత్తనం రాష్ట్రాలదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 20: ఉద్యోగుల పెన్షన్ విషయంలో రాష్ట్రాలకే పూర్తి అధికారాలు ఉన్నాయని బిజేపీ కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు అన్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని, పశ్చిమబెంగాల్, త్రిపుర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో పాత విధానాన్ని కొనసాగిస్తున్నాయని గుర్తు చేశారు. మంగళవారం నగరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యుపిఏ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పెన్షన్ (కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్) విధానాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ అంగీకరించి దానిని అమలు చేస్తామని ప్రకటించగా, తెలంగాణ అవిర్భావం తరువాత ఆ విధానాన్ని ఉద్యోగులకు అనువయిస్తామంటూ కేసీఆర్ ప్రభుత్వం 2014 ఆగస్టు 23న జివోఎంఎస్ నెంబర్ 28ద్వారా ఉత్తర్వులు జారీచేసిందని వివరించారు. రానురాను ఉద్యోగుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో ఆ అంశం రాష్ట్ర పరిధిలో లేదని, కేంద్ర పరిధిలో ఉందని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అబద్దపు మాటలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే సమస్యలన్ని పరిష్కారమవుతాయని, సర్వ రోగ నివారిణి అంటూ మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారని, ప్రతిదీ కేంద్రంపై నెట్టివేయడం అలవాటు చేసుకున్నారని దుయ్యబట్టారు. కేంద్రం రాష్ట్రానికి 2లక్షల ఇళ్లు మంజూరు చేస్తే ఆ పనుల్లో పురోగతి లేక నిధులు నిలిచిపోయాయని, ఫసల్ బీయా యోజన పథకం కింద 40శాతం బీమా చేయాల్సి ఉండగా, 4శాతం కూడా చేయలేదని, ఇలా అనేక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేయడమేకాకుండా కేంద్రంపైనే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సీఏం కేసీఆర్ అబద్దపు మాటలను ఉద్యోగులు నమ్మవద్దని, పాత పెన్షన్ విధానం కోసం ఈ నెల 25న తలపెట్టిన ఉద్యోగుల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. నీటి నిర్వహణ విషయంలో మంత్రులు, ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడం మూలంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, ఇది ప్రకృతి తప్పిదం కాదని, ప్రభుత్వ తప్పిదమని ఆరోపించారు. ఉమ్మడి జిల్లా రైతాంగానికి సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్‌రావు, రాజేందర్‌లు క్షమాపణలు చెప్పడంతోపాటు ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.20వేలు అందించి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లోనైనా నీటి నిర్వహణపై స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలని, ఏ ప్రాజెక్టు నుంచి ఏ ఆయకట్టుకు ఎంత నీరందిస్తారో స్పష్టంగా ప్రకటించాలని, నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, నకిలీ విత్తనాలను అరికట్టాలని సుగుణాకర్‌రావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు కనె్నబోయిన ఓదెలు, బాసవేణి మల్లేశం, మిర్యాల్‌కార్ నరేందర్, ద్గురం మారుతి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

పట్టణ సుందరీకరణే లక్ష్యంగా పనిచేయాలి
* అధికారులకు కలెక్టరేట్ శ్రీదేవసేన పిలుపు
పెద్దపల్లి, మార్చి 20: పెద్దపల్లి జిల్లాలో పట్టణ సుందరీకరణే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం పట్టణ అభివృద్ది పనుల ప్రతిపాధనలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని, ఈదిశగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రూ.2వేల కోట్లు కేటాయిస్తుందని, పట్టణాలలో వౌలిక వసతులు కల్పిస్తూ నాలుగు నెలలో పట్టణాలను సందరీకరించే ప్రణాళికలు సిద్దం చేయాల్సిందిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ వీడియో కాన్పరెన్స్‌లో ఆదేశించారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా రెండురోజుల్లో ప్రతిపాదనలు సిద్దం చేసి నిర్మాణ ఇంజనీర్లకు, వాస్తుశిల్పిలకు అప్పగించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో గర్రెపల్లి, ఐతరాజ్‌పల్లి, రామగుండాల ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ది చేయాలని అటవీ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పట్టణాలలో అవసరమైన రోడ్లు, జంక్షన్లు, మార్కెట్లు, పార్కులు, పట్టణాలలో చెరువులను, చెరువుల వెంట పుట్‌పాత్‌లు నిర్మించి అభివృద్ది చేయాలని తెలిపారు. ఈసమీక్షా సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి, జిల్లా ఇన్‌చార్జి డిఆర్వో పద్మయ్య, పెద్దపల్లి ఆర్డివో అశోక్‌కుమార్, రామగుండం మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, పెద్దపల్లి మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసన్, ఈఈపిఆర్ వెంకటేశ్వర్‌రావు, ఈఈ ఆర్‌అండ్‌బీ కృష్ణమూర్తి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.