కరీంనగర్

భ్రష్టు పట్టిన రాజకీయాల ప్రక్షాళన జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మార్చి 20: ప్రజా సమస్యలపై సమరం సాగించాలని, ఇందు కోసం గ్రామాలలో పార్టీ శ్రేణులు సమస్యలను గుర్తించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సీపీఐ ద్వితీయ జిల్లా మహాసభలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా తొలుత పట్టణంలో పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక వాసవి కల్యాణ మండపంలో రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా మహాసభల ప్రారంభోత్సవానికి చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిధిగా హాజరుకాగా జిల్లా కార్యదర్శి గుంటి వేణు అధ్యక్షత వహించి, వార్షిక నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలో సీపీఐ భూమి కొరకు భుక్తి కొరకు అణగారిన వర్గాల విముక్తి కొరకు పోరాటం చేస్తూంటే అనేక వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు విస్మరించాయని, ఫలితంగా ప్రజలు సమస్యల వలయంలో నలుగుతున్నారని అన్నారు. దేశంలో అవకాశవాద రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయని, వాటి ప్రక్షాళన జరగాలని, మతతత్వం పెరిగిపోయిందని, విదేశాల నుండి రప్పిస్తానన్న నల్ల డబ్బు రాలేదని, నిరుద్యోగం పెరిగిపోయిందని, ధరల నియంత్రణ లేకుండా పోయిందన్నారు. పాలనలో అవినీతి పెచ్చు పెరిగిందని, రైతుల రుణ మాఫీ చేయకుండా కార్పోరేట్‌ల కొమ్ము కాస్తున్నారని, అప్పులు ఎగగొట్టే వారికే పాలకులు సహకరిస్తున్నారని అన్నారు. ఈ స్థితిలో ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఫ్యూడల్ పాలన కొనసాగుతున్నదని, ప్రజలు నిరసన తెలుపుకునే అవకాశం లేకుండా ధర్నా చౌక్‌లను ఎత్తి వేశారని, ప్రశ్నించేవారిని అరెస్టులతో అణచి వేస్తున్నారని, ప్రజాస్వామ్యం పూర్తిగా హరించి వేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా ట్యాంక్ బండ్‌పై నినాదాలు ఇచ్చి స్ఫూర్తిని చాటామని అన్నారు. సీపీఐ అనేక సమస్యలపై పోరాటం సాగిస్తున్నదని, నేరెళ్ళ ఉదంతంపై రాష్టప్రతి వరకు వెళ్ళి ఎండగట్టామన్నారు. కేసీఆర్ చెబుతున్న ధర్డ్ ఫ్రంట్‌కు ఎలాంటి విధి విధానాలు లేవన్నారు. సమస్యలపై ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని, కొలువుల కొట్టాట, వ్యవసాయ సంరక్షణ నిర్మాణంకు కదం తొక్కుతామని, ప్రజా సమస్యలపై సీపీఐ కంకణం కట్టుకుందని, ఎన్నికలపుడే రాజకీయాలని, నిరంతరం తాము ప్రజల వద్ద ఉండి వారి పేదల పక్షాన పోరాటం సాగిస్తామని, ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు కృషి వెంకటరెడ్డి చేస్తామన్నారు. సామాజిక తెలంగాణ కోసం ఉద్యమించాలని, ప్రజా సంఘాలు బలోపేతం కావాలని, త్యాగాల వైపు, ప్రజల వైపే సీపీఐ నడుస్తుందని, సీపీఐకి పూర్వ వైభవం తేవాలని అన్నారు. ఇక సిరిసిల్లలో మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావనికి చిక్కులు రావని, అందుకే నిజాలు తెలిపిందని, జరుగుతున్న చరిత్రను కుండబద్దలు కొట్టిందని అన్నారు. రాజకీయాలు ఎలా కంపు కొడుతున్నాయో, కమీషన్ల పర్వం గుట్టును పావని విప్పిందన్నారు. ఇలాంటి రాజ్యం పోవాలని, ప్రజారాజ్యం కావాలని, ప్రస్తుతం కంపు రాజకీయాలు నడుస్తున్నాయని, సీపీఐ నిప్పు రాజకీయాలు నెరుపుతున్నదని, అందుకే రాజకీయ ప్రక్షాళన వైపే నడుం బిగించి, అవినీతి అంతమే సీపీఐ లక్ష్యంగా సాగుతుందని చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో ఎఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామల మల్లేశం, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మంత్రి చంద్రన్న, బూర శ్రీనివాస్, పోలు కొమురయ్య, మిద్దె నర్సన్న, సీనియర్ నాయకులు నల్ల చంద్రవౌళి, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి సుజన, జిల్లా కార్యదర్శి కెవి.అనసూర్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు వడ్డెపల్లి లక్ష్మణ్, పట్టణ సీపీఐ నాయకులు అజ్జా వేణు, బైరి చిన్నబాబు, సుద్దాల రాజు తదితరులు పాల్గొన్నారు.

కుల వృత్తుల ప్రోత్సాహానికి కృషి
* కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్ రూరల్, మార్చి 20: కుల వృత్తుల ప్రోత్సాహానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. మంగళవారం కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామంలో పశుగ్రాసం, గడ్డి విత్తనాల పంపిణీపై గొర్రెల కాపరుల పెంపకందారులు ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇప్పటివరకు 6,200 గొర్రెల యూనిట్లను పంపిణీ చేశామని, ఒక యూనిట్‌కు 21 గొర్రెలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఈ యూనిట్లు ప్రతీ నెల గ్రౌండింగ్ చేస్తామని అన్నారు. వేసవి కాలమైనందున గొర్రెల రవాణా చేస్తే చనిపోయే అవకాశం ఉన్నందున ఈ రెండు నెలల్లో గ్రౌండింగ్ తక్కువగా ఉంటుందని అన్నారు. గొర్రెలు, పశువుల పశుగ్రాసం కోసం ప్రతీ గ్రామంలో విత్తనాలు పంపిణీ చేసి చల్లేలాగా చూడాలని కోరారు. వేసవిలో నీటి కొరత ఉన్నందున వాటర్ ట్రిప్స్‌లను మరమ్మత్తులు చేయించి నీటితో నింపుతామని అన్నారు. ఒక గొర్రె యూనిట్‌కు ఐదు కిలోల గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తామని అన్నారు. ఈ వేసవిలో గొర్రెలు, మేకలు, పశువులు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ల బృందంచే సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం గొర్రెలకు, నట్టల మందును వేశారు. అనంతరం ముగ్దుంపూర్‌లో ఉపాధిహామీ పనులను, డంపింగ్ యార్డు, ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమీషనర్ శశాంక్, ఫశుసంవర్థక శాఖ జెడి విక్రం కుమార్, ఆర్‌డిఓ రాజాగౌడ్, తహశీల్దార్ రాజ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.