కరీంనగర్

విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్వశ్రీరాంపూర్, మార్చి 20: విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు వివేక్ అన్నారు. ఆయన మంగళవారం మండలంలోని వెన్నంపల్లి, కాల్వశ్రీరాంపూర్, మడిపల్లి, పెగడపల్లి గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలకు విశాఖ చారిట్రబుల్ ట్రస్ట్ ద్వారా 200 బెంచీలను ఉచితంగా అందించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పది వేల కోట్ల నిధులు కేటాయించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశానికే ఆదర్శమని, అది పూర్తయితే ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు దూరమవుతాయన్నారు. నిరుపేద కుటుంబానికి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని, కల్యాణలక్ష్మిని లక్షా 116 లకు పెంచిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అన్నారు. విశాఖ చారిట్రబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు నిరంతరం సేవలందిస్తామని, ఈ ట్రస్ట్ ద్వారా 1200 పాఠశాలలకు బెంచీలు అందించామని, తాగునీటి అవసరాల దృష్ట్యా ప్రజలు కోరిన ప్రతీ చోట బోర్‌వెల్స్ వేయిస్తున్నామన్నారు. విద్యార్థులు బాగా చదివి అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు తమ ట్రస్ట్ ద్వారా పారితోషికాలు అందిస్తామన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని తాగునీటి కష్టాలను తీర్చేందుకు రెండు బోర్‌వెల్స్‌ను మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు మరో 200 బెంచీలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, జడ్పీటీసీ లంక సదయ్య, ఎంఇఓ సమ్మయ్య, ఎంపీడీఓ పోలు సురేష్, కొనకటి మల్లారెడ్డి, ఎల్.రాజయ్య, తుల మనోహర్ రావు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు
* వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శాంత కుమారి
కరీంనగర్, మార్చి 20: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిభిరాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శాంత కుమారి అన్నారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ మండల కేంద్రంలోని ప్రతీ గ్రామాన్ని, పట్టణ ప్రాంతాల్లో అన్ని వార్డులను కవరయ్యేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. టీముల వారిగా ఏర్పాటు చేసిన వారికి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఈ వైద్య శిభిరాలలో కంటి, బీపీ, షుగర్, మూత్ర తదితర వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకు కావాల్సిన మందులను అందజేయాలని, మెడికల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో టీములను ఏర్పాటు చేయాలని, వైద్య శిభిరాలలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి గ్లాసులు, రీడింగ్ గ్లాసులు ఇవ్వాలని, ఇందుకు కావాల్సిన వైద్య పరికరాలు నిధులకోసం ప్రణాళికలు తయారు చేసి సమర్పించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మోబైల్ టీములను ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రాజేశం, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.