కరీంనగర్

అవసరం లేకున్నా ఆపరేషన్లు చేసిన ఇద్దరి వైద్యుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుట్ల, ఏప్రిల్ 19: ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని అవసరం లేకున్నా అపెండెక్స్ ఆపరేషన్లు నిర్వహించి లక్షల్లో ఫీజులు వసూలు చేసిన ఇద్దరు వైద్యులను అరెస్టు చేసినట్లు కోరుట్ల సిఐ రాజశేఖరరాజు తెలిపారు. మంగళవారం కోరుట్ల పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ రాజశేఖరరాజు మాట్లాడుతూ కథలాపూర్ మండలంలోనే 557అపెండెక్స్ ఆపరేషన్లు చేసిన తాండ్య్రాల గ్రామానికి చెందిన జక్కని గణేష్ అనే పిఎంపి, జగిత్యాల పట్టణానికి చెందిన విజయలక్ష్మి నర్సింగ్ హోం నిర్వాహకులు వైద్యులు తాటిపాములు సురేష్‌కుమార్ వద్ద అవసరం లేకున్నా ఆపరేషన్లు చేయించి చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్న ఇద్దరు వైద్యులను ఉమెన్స్ రైట్స్ ఆదేశాలు, బాధితుల ఫిర్యాదు మేరకు ఇద్దరి అరెస్టుచేసి 420కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు సిఐ రాజశేఖరరాజు తెలిపారు. ఇదే విధంగా మరి కొంతమంది వైద్యులు కూడా ఈ ఆపరేషన్లలకు పాల్పడుతున్నారని వారిపై కూడా ఫిర్యాదులు వచ్చాయని సమగ్ర విచారణ కొనసాగిస్తున్నామని త్వరలో వారిని కూడా పట్టుకుంటామని సిఐ వెల్లడించారు. ఈ సమావేశంలో కథలాపూర్ ఎస్సై నిరంజన్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.