కరీంనగర్

మహనీయుల జయంతి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 22: ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్‌రామ్, 14న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, దళిత సంఘాల నాయకులతో జయంతి వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రామ్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణకు ప్రభుత్వం లక్ష చొప్పున రెండు లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. నాయకులు, అధికారులు కలిసి సమన్వయంతో మహానీయుల జయంతి వేడుకలను ఘనంగా విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. వేడుకల సందర్భంగా షామియానాలు, డయాస్, కుర్చీలు, మైక్ తదితర ఏర్పాట్లతోపాటు భోజన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మహానీయుల జీవిత చరిత్రతో కూడిన కరపత్రాలు, పోస్టర్లు ముద్రించి అన్ని గ్రామాలకు పంపుతామని అన్నారు. జయంతి వేడుకల గురించి జిల్లా పంచాయితీ అధికారి ద్వారా గ్రామాల్లో టాంటాం వేయిస్తామని తెలిపారు. అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ సీనిమా ప్రదర్శిస్తామని, జయంతి ఉత్సవాల రోజున ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, 3,4చోట్ల మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బద్రీ శ్రీనివాస్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రావీణ్య, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ డిడి శ్రీమాల, ఎసీపీ రాగ్యానాయక్, దళిత సంఘాల నాయకులు మేడి రాజవీరు, కంసాల శ్రీనివాస్, జానపట్ల స్వామి, గజ్జెల ఆనందరావు, కల్లెపల్లి శంకర్, మేడి మహేష్, వెంకటస్వామిలతోపాటు పలువురు పాల్గొన్నారు.