కరీంనగర్

ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, మార్చి 22: ప్రభుత్వ పథకాల అమలులో జగిత్యాల జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నేస్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కలువగా కార్యక్రమాల అమలు తీరుపై ప్రదర్శన ఇచ్చారు. తెలంగాణ ఎక్స్‌లేన్స్ అవార్డు కోసం నాలుగు విభాగాల్లో జిల్లా నుండి ప్రతిపాదనలు పంపగా మూడు విభాగాలు రెవెన్యూ భూరికార్డుల శుద్ధి కరణ, గొర్రెల అభివృద్ధి పథకం, కేసిఆర్ కిట్ విభాగంలో క్షేత్ర పరిశీలనకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నేస్ నుండి కన్షటెంట్, నాల్జేడ్ పర్సన్లకు జిల్లాలో సాధించిన ప్రగతిపై వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ భూ రికార్డుల శుద్ధికరణ, ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామన్నారు. జమీన్ బంధీ కార్యక్రమాన్ని చేపట్టిన 26వేలకు పైగా సమస్యలు పర్కిరించామని తెలిపారు. సాదాబైనామా కేసుల పరిష్కారంలో జిల్లా ముందంజలో ఉందన్నారు. జిల్లాలో 99.8శాతం వివాద రహితంగా కేవలం 0.92శాతం వివాద భూమిగా గుర్తించామన్నారు. 99శాతం మేర ఆధార్ సీడింగ్, 99.91శాతం క్లియర్ భూమిలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నామన్నారు. 60శాతం పంట రుణాల పంపిణీలో రాష్ట్రంలో ప్రథమ స్థానం సంపాదించామన్నారు. 9739 గొర్రెల యూనిట్లు పంపిణీ చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచామని ఆసుపత్రిల్లో హెల్ఫ్ డెస్క్‌లను ఏర్పాటు చేసి ప్రజలతో మమేకమయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో స్ర్తి, శిశుసంక్షేమ శాఖ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో పని చేసి మంచి సేవలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. గర్భీణీల నమోదు దగ్గర నుండి ప్రసవం వరకు బాధ్యతగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజెంటేషన్‌లో ప్రతినిధులు అడిగిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెసి బి. రాజేశం, ఆర్డీఓ నరేందర్, జిల్లా వైద్యాధికారిణి సుగంధిణి, పశుసంవర్థక శాఖ డిడి అశోక్‌రాజు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నేస్ కన్షటెంట్ వెంకటేశ్వర్‌రావు, నాల్జెడ్ పర్సన్ స్వాతి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.