కరీంనగర్

కుడి కాలువ పనులు వెంటనే చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధర, మార్చి 22: గంగాధర ప్రాజెక్టు నిర్మాణంలో ఎడమ కాలువ పనులు చేపట్టి నీటిని విడుదల చేసిన అధికారులు కుడి కాలువ పనులు పెండింగ్‌లో పెట్టడం ద్వారా రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని, వెంటనే కుడి కాలువ పనులు చేపట్టి రైతుల సాగునీరు, ప్రజల తాగునీటి సమస్య తీర్చాలని గంగాధర చౌరస్తాలో చేపట్టిన ధర్నా, రాస్తారోకోలో కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కెడీసీసీ డైరెక్టర్ వెలిచాల తిరుమల్‌రావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షుడు గజ్జెల కాంతం, మేడిపల్లి సత్యం, బండ శంకర్‌ల ఆధ్వర్యంలో గంగాధర ప్రాజెక్టుకు సంబంధించిన కుడి కాలువ నిర్మాణం పనులు రెండు కిలోమీటర్ల మేర పెండింగ్‌లో పెట్టడం ద్వారా గంగాధర, బోయినిపల్లి మండలాలలో సాగునీటి విడుదల జరుగక రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కుడి కాలువ నిర్మాణం పనులలో భాగంగా ప్రాజెక్టు నుండి గంగాధర చౌరస్తా కురిక్యాల గ్రామ శివారులోని రెండు కిలోమీటర్ల మేర భూ సేకరణ చేపట్టకపోవడంతో కాలువ నిర్మాణం పనులు జరుగక నీటి విడుదల జరుగడం లేదని తద్వారా ఆయా ప్రాంతాల్లో సాగు, తాగునీటికి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. గంగాధర చౌరస్తాలోని కురిక్యాల, గంగాధర గ్రామ పంచాయతీ పరిధిలో గల భూములకు మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లించి భూ సేకరణ చేసి వెంటనే కాలువ నిర్మాణం పనులు చేపట్టాలని రాస్తారోకోలో పలువురు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులకు వేల కోట్లు వెచ్చించి పనులు చేపట్టి పూర్తి చేస్తున్నా గంగాధర ప్రాజెక్టు కుడి కాలువ పనులు పెండింగ్‌లో పెట్టడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నించారు. వెంటనే భూ సేకరణ చేసి పరిహారం చెల్లించి కాలువ నిర్మాణం పనులు చేపట్టకపోతే గ్రామాలలో గల రైతుల ద్వారా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. గంటపాటు చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయి ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్‌ఐ స్వరూప్ రాజ్ ఆందోళనకారులకు తెలుపడంతో వినిపించుకోకపోగా రోడ్డుపై బైఠాయించడంతో సిఐ రమేష్ ధర్నా, రాస్తారోకో కార్యక్రమానికి చేరుకొని గజ్జెల కాంతంను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించడంతో ఆందోళన కార్యక్రమం ముగిసింది. ఈ రాస్తారోకో కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంటు యూత్ కాంగ్రెస్ ఇంచార్జి నాగి శేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు రామిడి రాజిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు కోల లింగారెడ్డి, దుబ్బాసి బుచ్చయ్య, జారతి సత్యం, రోమాల రమేష్, అలువోజు నందయ్య, భట్టు లక్ష్మినారాయణ, కొలెపాక స్వామి, సంకటి శ్రీనివాస్, పురుమల్ల మనోహర్‌తో పాటు కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.