కరీంనగర్

ఆశీర్వదించండి...సేవా చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడటౌన్,మార్చి 23: ఇక్కడి ఓటరు దేవుళ్లు ఆశీర్వదిస్తే తాను నియోజవర్గానికి సేవ చేస్తానని ఏఐసీసీ సభ్యులు కొనగాల మహేశ్ చెప్పారు. ఇటీవల అఖిల భారత కాంగ్రెస్ సభ్యులుగా నియామకం అయిన తొలిసారి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వేములవాడ 30యేళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదని, ఇక్కడి యువత ఉపాధి అవకాశాలు లేక బొంబాయి,దుబాయి బాట పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.తెరాస అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతున్న ఈ జిల్లాలో ఉపాధి అవకాశాలను కల్పించలేదని విమర్శించారు.బీడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగించే మహిళల పరిస్థితి దయనీయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.వీటిని నియోజకర్గంలో ఈ సమస్యలను శాశ్వతంగా రూపుమాపడానికి తాను కృషి చేస్తానని తెలిపారు.బడుగు,బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని, ఆ దిశగా ప్రజలు కలసి రావాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ ఆయకులు మహంకాళీ శ్రీనివాస్‌గౌడ్,కూరగాయల కొమురయ్య,పల్లం సత్తయ్య,చెదలు సత్యనారాయణ,వినోద్,అన్వర్ తదితరులు పాల్గోన్నారు. కాగా రాజరాజేశ్వరస్వామిని ఏఐసీసీ సభ్యులు కొనగాల మహేశ్ శుక్రవారం దర్శించుకున్నారు.ముందుగా స్వామివారికి కోడె మొక్కు చెల్లించుకున్నారు.అంతరాలయంలోని స్వామివారిని ,అమ్మవారిని దర్శించుకొని తరించారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆయన్ను ఆశీర్వదించి ప్రసాదాలను అందజేశారు.

వేసవి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
* స్థాయా సంఘ సమావేశంలో సభ్యుల సూచన
కరీంనగర్ టౌన్, మార్చి 23: రాబోయే వేసవిలో నగరవాసులకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు అవసరమైన సామాగ్రిపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ స్థాయి సంఘ సమావేశంలోపలువురు సభ్యులు సూచించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్‌లో నిర్వహించిన స్థాయి సంఘ సమావేశం జరిగింది. చైర్‌పర్సన్ సర్ధార్ రవీందర్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలోనగర పాలక సంస్థ అభివృద్ధి పనుల్లో భాగంగా 14 ఎజెండా అంశాలు పరిగణలోకి తీసుకున్నారు. మార్కెట్ రిజర్వాయర్‌లో లెవల్ ఔట్ ఏరియాలో 250 కెవి జనరేటర్ టెస్టింగ్, డెలివరీ, నగరంలోని పలు డివిజన్లలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైన్ కల్వర్టు, యూజిడి ఇన్‌స్పెక్షన్ చాంబర్లు, ఫిల్టర్ బెడ్‌లో ప్రహరీ గోడ నిర్మాణ పనులు, ఎస్‌డబ్ల్యుజి పైప్‌లైన్ డ్రైన్, తదితర అంశాలపై స్టాండింగ్ సమావేశంలో తీర్మాణం చేశారు. సమావేశంలో మున్సిపల్ కమీషనర్ కె.శశాంక, స్థాయి సంఘ సభ్యులు వాల రవి, కర్రె లింగయ్య, రజనీదేవి, అపర్ణ, సాదవేణి సుజాత, మున్సిపల్ కార్యదర్శి గౌతంరెడ్డి, ఎస్‌ఈ శరత్‌బాబు, ఈఈ మోహన్, డీఈ యాదగిరి, ఆర్వో రాములు, ఏసిపి కోటేశ్వర్ పాల్గొన్నారు.