కరీంనగర్

పెద్దల సభకు మనోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 23: అందరు ఊహించినట్లుగానే రాజ్యసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ అభ్యర్థి జోగినపెల్లి సంతోష్‌కుమార్ విజయం సాధించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్‌లోని శాసనసభ కమిటీ హాల్-1లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సంతోష్‌కుమార్ 32 ఓట్లతో గెలుపును సొంతం చేసుకున్నారు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ వేటు వేయగా, 117 మంది ఉన్నారు. వీరిలో 108 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొనగా, సంతోష్‌కుమార్‌కు 32 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారులు సంతోష్‌కుమార్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన సంతోష్ టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించడంతోపాటు ఉద్యమ కాలంలో అరెస్టయి ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఎన్నికల్లో పోటీచేసే సందర్భాల్లోనూ వెన్నుదన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టి గుర్తింపునిచ్చారు. పార్టీ పరంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ అధికారికంగా మరో అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న కేసీఆర్ సంతోష్‌కుమార్‌ను టీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించగా, శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సంతోష్‌కుమార్ గెలుపును సొంతం చేసుకున్నారు. ఇప్పటికే పెద్దల సభకు జిల్లా నుంచి కెప్టెన్ లక్ష్మికాంతారావు ప్రాతినిధ్యం వహిస్తుండగా, తాజా ఎన్నికల్లో సంతోష్‌కుమార్ విజయం సాధించారు. చిన్న వయస్సులోనే పెద్దల సభలో సంతోష్ అడుగుపెట్టబోతున్నారు. మొత్తానికి పెద్దల సభకు ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. సంతోష్‌కుమార్ విజయం సాధించడం పట్ల టీఆర్‌ఎస్ శ్రేణుల్లో, అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.