క్రైమ్/లీగల్

వడదెబ్బతో భవన నిర్మాణ కార్మికుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ రూరల్, మార్చి 23: కరీంనగర్ రూరల్ మండలంలోని బావుపేట గ్రామానికి చెందిన నిర్మాణ కార్మికుడు ఒరుగంటి మల్లయ్య (55) గురువారం అర్ధరాత్రి మృతి చెందాడని స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపారు. వారి వివరాల ప్రాకారం గురువారం మృతుడు భవన నిర్మాణ పనిచేస్తు అస్వస్థతకు గురికావడంతో మృతి చెందాడని అన్నారు. కాగా మృతుడు నిరుపేద కావడంతో చాలా అర్ధిక ఇబ్బందులు పడుతు కుటుంబాని పోషిస్తున్నాడని మృతునికి భార్య ముగ్గురు కుమార్తేలని మొదటి కుమార్తేకు ఇటివలనే వివాహం చేశాడని, రెండవ కమార్తే 10 వతరగతి చదువుతు అర్థిక ఇబ్బందులతో మద్యలో మానేసిందని తెలిపారు. ఈ విషయం తెలుకున్న గ్రామ సర్పంచ్ దావ వాణిమణి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, స్థానికులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలకు అర్థిక సాయం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా అన్ని విధాల అదుకుంటామని పేర్కొన్నారు.

ఇసుక లారీల పట్టివేత
సిరిసిల్ల, మార్చి 23: సిరిసిల్ల మానేరు నుండి అక్రమంగా తరలి వెలుతున్న తొమ్మిది ఇసుక లారీలను మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇసుకను తీసకవెలుతున్నట్టు తప్పుడు బోర్డులు పెట్టి, ప్రభుత్వ పనులకు వీటిని వినియోంచే బోర్డులు తగిలించుకుని అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల చెక్‌పోస్టు పోలీసులకు లారీలను అప్పగించారు. సిరిసిల్ల మానేరు నుండి రోజు వందలాది లారీలలో ఇసుకను తరలిస్తూండగా ఇందులో ప్రభుత్వ వేబిల్లులతో కొన్ని వెలుతుండగా, మిగితా సగం ఇలా తప్పుడు మార్గాలతో ప్రభుత్వాన్ని మోసగిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. ఒకే వేబిల్లుతో పలు సార్లు ఇసుకను తరలించడం, అలాగే ప్రభుత్వ పనుల పేరుతో తప్పుడు బోర్డులు పెట్టుకుని తరలించడం, ఇందు కోసం వేగంగా వెలుతూ ప్రమాదాలకు గురి చేస్తూ పలువురి ప్రాణాలను హరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఒకేసారి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న తొమ్మిది లారీలను పట్టుకోవడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.