కరీంనగర్

ఒక్క సీసీ కెమెరా 30మందితో సమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి
* 50వ డివిజన్‌లో 101 కెమెరాల ప్రారంభం
కరీంనగర్, మార్చి 23: ఒక్క సీసీ కెమెరా 30మందితో సమానంగా పని చేస్తుందని కరీంనగర్ పోలీసు కమీషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి అన్నారు. సీసీ కెమెరాలు భద్రతకు భరోసా కల్పిస్తున్నాయని, నేరాల చేదన, నియంత్రణ కోసం కమీషనరేట్ పరిధిలో 50వేల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు. కరీంనగర్‌లోని 50వ డివిజన్‌లో శుక్రవారం సాయంత్రం ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 101 సీసీ కెమెరాలను సీపీ కాలనీవాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ మనిషి కొన్ని గంటలపాటు పనిచేసిన తరువాత అలసిపోతాడని, అదే సీసీ కెమెరాలు రేయింబవళ్లు అలుపెరగకుండా పనిచేస్తాయనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. నగరంలో ఇప్పటివరకు 2500 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కరీంనగర్‌లో త్వరలో నిర్మాణం జరగనున్న ఏడంతస్థుల కమాండ్ కంట్రోల్‌నకు సీసీ కెమెరాలను అనుసంధానం చేయడం జరుగుతుందని చెప్పారు. పేషీయల్ రికగ్నజేషన్ విధానం కూడా అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ విధానం ద్వారా అనుమానితుల ఫోటోలను అనుసంధానం చేస్తామని, దీని ద్వారా అనుమానితులు సంచరిస్తే కమాండ్ కంట్రోల్‌నకు సంకేతాలు అందుతాయని వివరించారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి ముందుకుసాగుతుందని అన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కెమెరాల్లో ఒక మనిషీ ఆరు కెమెరాల్లో నిక్షిప్తం అవుతున్నారని, కనీసం 50కెమెరాల్లో నిక్షిప్తం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డివిజన్‌లోని బ్యాంక్‌కాలనీ, మెహర్‌నగర్, వివేకానందపురి, వాసవినగర్‌లో ఈ కెమెరాలను ఏర్పాటు చేయగా, కెమెరాల ఏర్పాటుకు ముందుకువచ్చిన కాలనీవాసులకు సీపీ అభినందించారు.

ఆశీర్వదించండి...సేవా చేస్తా
ఏఐసీసీ సభ్యులు కొనగాల
వేములవాడటౌన్,మార్చి 23: ఇక్కడి ఓటరు దేవుళ్లు ఆశీర్వదిస్తే తాను నియోజవర్గానికి సేవ చేస్తానని ఏఐసీసీ సభ్యులు కొనగాల మహేశ్ చెప్పారు. ఇటీవల అఖిల భారత కాంగ్రెస్ సభ్యులుగా నియామకం అయిన తొలిసారి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వేములవాడ 30యేళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదని, ఇక్కడి యువత ఉపాధి అవకాశాలు లేక బొంబాయి,దుబాయి బాట పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.తెరాస అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతున్న ఈ జిల్లాలో ఉపాధి అవకాశాలను కల్పించలేదని విమర్శించారు.బీడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగించే మహిళల పరిస్థితి దయనీయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.వీటిని నియోజకర్గంలో ఈ సమస్యలను శాశ్వతంగా రూపుమాపడానికి తాను కృషి చేస్తానని తెలిపారు.బడుగు,బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని, ఆ దిశగా ప్రజలు కలసి రావాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ ఆయకులు మహంకాళీ శ్రీనివాస్‌గౌడ్,కూరగాయల కొమురయ్య,పల్లం సత్తయ్య,చెదలు సత్యనారాయణ,వినోద్,అన్వర్ తదితరులు పాల్గోన్నారు. కాగా రాజరాజేశ్వరస్వామిని ఏఐసీసీ సభ్యులు కొనగాల మహేశ్ శుక్రవారం దర్శించుకున్నారు.ముందుగా స్వామివారికి కోడె మొక్కు చెల్లించుకున్నారు.అంతరాలయంలోని స్వామివారిని ,అమ్మవారిని దర్శించుకొని తరించారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆయన్ను ఆశీర్వదించి ప్రసాదాలను అందజేశారు.