క్రైమ్/లీగల్

భారీగా గుట్కా నిలువలు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఏప్రిల్ 5: సిరిసిల్ల పట్టణంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి రూ.6.25 లక్షల విలువల గల నిషేధిత గుట్కాల నిల్వలు పట్టుకున్నారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు, పోగాకు పధార్థాలను అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగిస్తున్న ఉదంతంపై విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం ఉదయం నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈమేరకు పట్టుబడిన నలుగురు నిందితులను, స్వాధీనం చేసుకున్న రూ.6.25 లక్షల విలువ గల 50 ప్లాస్టిక్ బ్యాగుల గుట్కా నిలువలను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డె సమక్షంలో విలేఖరుల ముందు హాజరు పర్చి వివరాలను వెల్లడించారు. అరెస్టు అయిన వారిలో సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్‌కు చెందిన లక్కం రంజిత్, నెహ్రూనగర్‌కు చెందిన వెల్దండి భాస్కర్, తారకరమానగర్‌కు చెందిన కొంపెల్లి మురళీకృష్ణ, నిజామాబాద్ జిల్లాలోని అహ్మదీనగర్‌కు చెందిన మహ్మద్ ఉమర్‌లు ఉన్నారు. ఉమర్ వద్ద సిరిసిల్లకు చెందిన రంజిత్, భాస్కర్, మురళీకృష్ణలు హోల్ సేల్‌గా నిషేద గుట్కాలు కొని, ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో రిటేల్ షాపుల ద్వారా ప్రజలకు విక్రయిస్తున్నారు. ఇందులో లక్కం రంజిత్‌ను గతంలో నిషేదిత గుట్కాల విక్రయాల కేసుల్లో అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చినట్టు తెలిపారు. అయినప్పటికీ ఇతడి ప్రవర్తన మార్చుకోకుండా ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఇది ఇలా ఉండగా విశ్వసీయ సమాచారం మేరకు గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు లక్కం రంజిత్ ఇంటిపై దాడి జరిపారు. ఇందులో సోదాలు నిర్వహించగా అతడి ఇంటి వెనుక భాగంలో ఏర్పాటు చేసిన స్టోర్ రూములో పెద్ద ఎత్తున ఉన్న నిషేదిత గుట్కాలు నిలువలు లభ్యం అయ్యాయి. ఈ సమయంలో రంజిత్, భాస్కర్, మురళీకృష్ణలు 50 బ్యాగుల గుట్కా నిలువలతో పాటే అక్కడే ఉన్నారు. వీరిని పట్టుకుని విచారణ నిర్వహించగా, నిజామాబాద్‌లోని అహ్మదీనగర్‌కు చెందిన మహ్మద్ ఉమర్ వద్ద బుధవారం 50 నిషేదిత గుట్కా నిలువలు కొనుక్కుని తెచ్చినట్టు వెల్లడించారు. పట్టుబడిన 50 ప్లాస్టిక్ బ్యాగుల్లో సాగర్, అంబర్, ఎస్ ఆర్-1, లతీఫ్ టబాకో, త్రిబుల్ ఎక్స్ పవర్, ఎస్‌జి గుట్కా, జెఎంజె 999, పాన్ బాహర్ తదితర గుట్కాలు ఉన్నాయని, వీటి విలువ రూ.6,25,000 ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డె మాట్లాడుతూ పట్టుబడిన ముగ్గురిపై పీడీ ఆక్టు అమలు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే అన్ని కిరాణ దుకాణదారులు, హోల్ సేల్ వ్యాపారులు, రేటేయిల్ దుకాణదారులు, పాన్ షాప్ దుకాణాల యజమానులు ఎవరు కూడా గుట్కాలు అమ్మరాదని, కొనరాదని, ప్రజల ప్రాణాలను హరించరాదన్నారు. ఎవరైనా అమ్మినా, కొన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.