కరీంనగర్

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల రూరల్, ఏప్రిల్ 17: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సీఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల చల్‌గల్ మార్కెట్ యార్డులో సహకార సంఘం అధ్యర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల జాయింట్ కలెక్టర్ రాజేశంతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. గత ఖరీప్‌లో ఆశించిన మేర పంట దిగుబడులు రాక రైతులు తీవ్రంగా నష్టపోయారని,్ధన్యంకు క్వింటాల్‌కు రూ. 2వేలు ప్రభుత్వ మద్దతు ధర ఉంటేనే గిట్టుబాటు అయ్యే అవకాశముంటుందన్నారు. తేమ శాతం చూపించే యంత్రాలను నాణ్యమైన వాటిని వినియోగించాలని, గన్నీబ్యాగ్‌ల కొరత లేకుండా చూడాలని, తూకాలు వేసిన వెంటనే సంబంధిత రైసు మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసీ చైర్‌పర్సన్ శీలం ప్రియాంక ప్రవీణ్, విండో చైర్మన్ అయిలవేణి గంగాధర్, మున్సిపల్ చేర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ పెండెం నాగలక్ష్మి రాములు, మాజీ ఎఎంసీ చైర్మన్ కొలుగూరి దామోదర్‌రావు, సర్పంచ్ జున్ను కవిత రాజేందర్, ఎంపిటిసి ముర్రి లక్ష్మి, డీఎల్‌సిఓ రామానుజచార్య, విండో ఉపాధ్యక్షుడు చొక్కారావు, డైరక్టర్లు రమేష్, నారాయణ, భారతపులింగారెడ్డి, ఎల్లయ్య, ధర్మయ్య, సంఘ సిఇఓ గాజెంగి వేణు, మేనేజర్ రాజేష్, నవీన్, మల్లేష్, ఎఎంసి డైరక్టర్లు, రైతులు పాల్గొన్నారు.

వడదెబ్బతో ఒకరి మృతి
కోరుట్ల, ఏప్రిల్ 17: కథలాపూర్ మండలంలోని ముషన్‌రావుపేట గ్రామానికి చెందిన చీర రాజారెడ్డి (50) అనే రైతు మంగళవారం వడదెబ్బ తాకడంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. వివరాల్లోకి వెల్లె రాజరెడ్డి అనే రైతు రోజువారిగానే మంగళవారం మధ్యాహ్నం సమయంలో తన పొలానికి అవసరం నిమిత్తం వెల్లగా ఎండ తీవ్రంగా ఉండటంతో వడదెబ్బ తగిలి మృతి చెందాడు. మృతినికి భార్య, ముగ్గురు కుమార్లు ఉన్నారు.