కరీంనగర్

రాగినేడును వణికిస్తున్న విషజ్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 26: మండలంలోని రాగినేడు గ్రామంలో విష జ్వరాలు విజృంభించాయి. దీనితో చాలా మంది మంచానికి పరిమితమయ్యారు. రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వైద్యం లభించక పోవడంతో కార్పోట్ ఆస్పత్రికి వెళ్లలేని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రతి రోజు వచ్చే రోగులతో కిక్కిరిసిపోతోంది. గ్రామంలో పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం వల్ల దోమలు వ్యాపించి విష జ్వరాల బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతోంది. గ్రామంలో ఇటీవల మిషన్ కాకతీయ పనుల నేపథ్యంలో నివాస ప్రాంతాల్లో విచ్చల విడిగా తవ్వకాలు చేపట్టారు. పలు చోట్ల మంచి నీటి పైపు లైన్ పగిలి పోయి నీరు వృథాగా పోతోంది. దీనితో నీటి నిల్వ కారణంగా దోమలు వ్యాపించి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. డెంగ్యూ వ్యాధి సోకి రక్త కణాలు తగ్గడంతో చాలా మంది ఖరీదైన వైద్యం కోసం లక్షలు ఖర్చు చేయాల్సిన పరస్థితి నెలకొంది. ఇప్పటికైన గ్రామంలో విష జ్వరాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 26: రూరల్ మండలంలోని చామన్‌పల్లి,జాబ్లీనగర్‌లలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, రైతు సమనవయ కమిటీ మండల అధ్యక్షులు కాశెట్టి శ్రీనివాస్, ఎంపిపి రమేష్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వ మద్దతు ధర రూ, 1590కు ప్రాథమిక వ్వవసాయ సహకార సంస్థ(పిఎసిఎస్) ఆధ్వర్యంలో నిర్వహించే కొనుగోలు కేంద్రాలోలనే వరిదాన్యం అమ్ముకోవలని కోరారు. దళారులను నమ్మి నష్టపోవద్దని తెలిపారు. ఇంకా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు శంకరయ్య, మోదుమ్‌పల్లి స్వామి ఉప సర్పంచ్, మార్కేట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మయ్య తదితరులున్నారు.