కరీంనగర్

1,45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తంగళ్ళపల్లి, ఏప్రిల్ 26: తంగళ్ళపల్లి మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ కృష్ణ్భాస్కర్ ప్రారంభించారు. గురువారం మండలంలోని గోపాల్‌రావుపల్లె, లక్ష్మీపూర్, తాడూర్, బద్దెనపల్లి, బస్వాపూర్, అంకిరెడ్డిపల్లి, వేణుగోపాల్‌పూర్, గండిలచ్చపేట, చిన్నబోనాల మండల కేంద్రమైన తంగళ్ళపల్లిలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017-18 సంవత్సరానికి గాను సెర్ప్(ఐకేపి), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 1,45,000 మెట్రిక్ టన్నుల రబీ ధాన్యం కొనుగోళ్లను లక్ష్యంగా ఎంచుకున్నట్టు తెలిపారు. అనుకున్న లక్ష్యానికి మించి పంట వచ్చినా, వాటిని ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉందన్నారు. వడగండ్ల వానలు, గాలి దుమారాలు వచ్చే ప్రమాదం ఉన్నందున రైతులు చేతికి వచ్చిన పంటని వీలైనంత త్వరగా కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. వరి పంటను ఐకేపి సెంటర్లకు విక్రయించే వరకు పూర్తి బాధ్యత రైతులదేనని, ధాన్యం కొనుగోళు చేసిన తరువాత రెండు రోజుల్లో డబ్బు నేరుగా రైతుల ఖతాల్లోకి జమ చేస్తారని తెలిపారు. ఐకేపీ ద్వారా 49 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న 15 రైస్ మిల్లులకే తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కొనుగోలు కేంద్రంలో కాంటా బాట్లు, మాయిశ్చర్ మిషన్, టార్ఫాలిన్లు, షెడ్‌లతో పాటు మంచి నీటీ సౌకర్యం, ప్రథమ చికిత్స కిట్ తప్పని సరిగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ మాట్లాడుతూ రైతులు దళారులకు ధాన్యం అమ్మకూడదన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాలుకి ఏ-గ్రేడు రూ.1590, కామన్ రకానికి రూ.1550లకు కొనుగోలు చేస్తారని తెలిపారు. రైతులు, కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ సెంటర్లను విజయవంతంగా నడిపించాలని కోరారు. కొనుగోలు సబ్ సెంటర్లను నిర్వహించకూడదని, తప్పని సరిగా ఎలక్ట్రిక్ వేయింగ్ మిషన్ వాడాలని, కొనుగోళ్లను ఎప్పటి కప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీవో మధన్‌మోహన్, డీపీఎం శారద, ఏపిఎంలు పర్శరాములు, పవన్‌కుమార్, సుధాకర్, తంగళ్ళపల్లి తహశీల్దార్ అంజన్న, జడ్పీటీసీ మంజుల, ఎంపీపీ శ్రీలత, ఏఎంసీ చైర్మన్ జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి కమిటి సభ్యులు పాల్గొన్నారు.