కరీంనగర్

ప్రజల అవసరాలకనుగుణంగా పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 26: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలు మెచ్చేవిధంగా, ప్రజల అవసరాలకనుగుణంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశ చిత్రపటంలో నెంబర్ వన్‌గా నిలబెట్టామని తెలిపారు. గురువారం సాయంత్రం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న పథకాలు దేశవ్యాప్తంగా అమలైతే బాగుంటుంది అని అనుకుంటున్నారని, దేశవ్యాప్తంగా మద్ధతు లభిస్తుందని తెలిపారు. ఉద్యమ సమయంలో ఎన్నో అవమానాలు, అపజయాలు ఎదుర్కొన్నామని, చివరకు గమ్యాన్ని ముద్దాడిన పార్టీ టీఆర్‌ఎస్సేనని అన్నారు. కేసీఆర్ పిలుపుతో తెలంగాణ ప్రజలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారని, పోరాడిన పార్టీకే ప్రజలు పగ్గాలు అందించారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో వచ్చేదికాదు..చచ్చేది కాదని, అంధకారంలో మగ్గుతుందని అవహేళన చేశారని, హైదరాబాద్‌లో అల్లకల్లోలం అవుతుందని విష ప్రచారం చేశారని, కానీ వాటన్నింటిని తిప్పికొట్టి పటిష్ట పాలన అందజేయడం మేము సాధించిన విజయమని అన్నారు. హస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పెడుతున్నామని, ఆడ పిల్ల గుండెమీద కుంపటి కాదు..లక్ష్మి అని కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. అంతేకాకుండా నీటి పారుదల రంగంలో ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును అద్బుతంగా నిర్మిస్తున్నామని, భగీరథ ద్వారా ఇంటింటికి నీరు అందించనున్నామని అన్నారు. ఇంకా చెప్పాలంటే రైతులకు రూ.17వేల కోట్లు రుణ మాఫీ చేయడమేకాకుండా పంట పెట్టుబడి సాయం కూడా అందజేస్తున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఏనాడు విశ్రమించలేదని, ప్రతిక్షణం అప్రమత్తంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీఆర్‌ఎస్ పార్టీ 5వ ప్లీనరీ జరుపుకుంటుందని, ఈ ప్లీనరీ భవిష్యత్‌కి దిక్సూచిగా మారనుందని అన్నారు. అలాగే పలు తీర్మాణాలతోపాటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తామని వెల్లడించారు. పాసులు అందిన ప్రతి ఒక్కరు పార్టీ ఆవిర్భావ సమావేశానికి రావాలని, ఈ సందర్భంగా జరిగే ప్లీనరీ చర్చల్లో పాల్గొనాలని మంత్రి కోరారు. ఈ సమావేశంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, కార్పొరేటర్ ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.