కరీంనగర్

రైతుబంధు కాదు.. ఉత్పత్తులకు బోనస్ ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 26: రైతు బంధు పథకం పేర మరోసారి వారిని మోసం చేయటం కాదు..రైతులు పండించిన పంటలకు బోనస్ ప్రకటించి, ఆదుకోవాలని బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని తన నివాసంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల ముందు రైతులకిచ్చిన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కేంద్రంపై రుద్దేయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మరణించిన రైతులకు పరిహారం అందజేయాలంటూ అధికారులను డిమాండ్ చేసిన బీజేపి నాయకులపై కేసులు పెట్టి, బెదిరింపులకు గురిచేయటం ప్రభుత్వ గుండాగిరికి నిదర్శనమన్నారు. రైతు కుటుంబాలనాదుకుని, వారి కుటుంబాల్లోని అర్హులకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. మద్ధతు ధర కనుగుణంగా బోనస్ పెంచితే, రాష్ట్రంలో రైతుల బలవన్మరణాలు ఆగిపోయేవన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచుతుందని, ఇందుకవసరమైన సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. పత్తికి క్వింటాల్‌కు రూ.1000, వరికి క్వింటాల్‌కు రూ.500 మద్దతు ధర అందించి, రైతులనాదుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇసుక మాఫియా పెట్రేగిపోతుందని, గోదావరి, మానేరు నదులను ఇసుకాసురులకు విక్రయించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం కుటుంబ దోపిడీకి గురవుతూ, రైతులు పిట్టల్లా రాలిపోతుంటే కనీస పట్టింపులేకుండా వ్యవహరిస్తుండటం దగాకోరు తనానికి నిదర్శనమన్నారు. కేవలం మాటలకే పరిమితమైన ప్రభుత్వ నేతలు రైతులకు కొత్త పాస్‌బుక్కుల పేర మరోసారి మోసం చేసేయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలులో వైఫల్యం చెందిన ప్రభుత్వం రైతుబంధు అమలుతో మరోసారి పలుచన కాబోతుందన్నారు. కర్ణాటక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ఖేల్ ఖతం కాబోతుందని, ఆ రాష్ట్రంలో బీజేపీ గెలుపును ఎవరు అడ్డుకోలేరని, 2019లో తెలంగాణలో కూడా తమ పార్టీ అధికారంలోకి రావటం తథ్యమని జోష్యం చెప్పారు. ఈ సమావేశంలో ఆపార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు కర్రె సంజీవరెడ్డి, కొరివి వేణుగోపాల్, తాళ్ళపల్లి హరికుమార్‌గౌడ్, ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, గాజుల స్వప్న, రాపర్తి విజయ, జీడి సదయ్య, అన్నాడి రాజిరెడ్డి, కంకణాల జ్యోతిబసు, బషీరొద్దిన్, బల్భీర్‌సింగ్, గుర్రాల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

వాల్ పోస్టర్లు అతికిస్తే కఠిన చర్యలు
* మున్సిపల్ కమిషనర్ శశాంక
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 26: ప్రభుత్వ చారిత్రక చిత్రాలు గీసిన గోడలపై వాల్ పోస్టర్లు అతికిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని నగర పాలక సంస్థ కమిషనర్ కె.శశాంక హెచ్చరించారు. నగరంలోని బస్టాండ్ సమీపంలోగల ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ ప్రహరీ గోడలపై గీసిన చిత్రాలపై వాల్ పోస్టర్లు అతికించడాన్ని గమనించిన ఆయన నగర పాలక సిబ్బందిని రప్పించి, తొలగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాల గోడలపై, రహదారుల వెంట కళాచిత్రాలు వేసిన గోడలపై ప్రకటనల గోడ ప్రతులు అతికించరాదని, నగర సుందరీకరణకు ప్రైవేట్ రంగ సంస్థలు, సినిమా థియేటర్లు, రాజకీయ పార్టీలు, ఇతర వర్గాలు, సంఘాలు సహకరించాలని కోరారు. గోడ ప్రతులు అతికిస్తే చట్టపరమైన చర్యలతో పాటు జరిమానా విధిస్తామని, నగరం సుందరంగా ఉండటం కోసమే తెలంగాణ చరిత్రకు గుర్తుగా కళాచిత్రాలు గీయించటం జరిగిందని, దీనిని గమనిస్తూనే ప్రకటనల గోడ ప్రతులు అతికించటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పలు డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. స్మార్ట్ సిటీలో భాగంగా నగర ఐలాండ్ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించి, చౌరస్తాలోని ఐలాండ్ వాటర్ ఫౌంటేన్ పరిశీలించారు. సుందరీకరణలో భాగంగా ఐలాండ్‌ను కుదించి ఫౌంటేన్ తీర్చిదిద్దాలని సూచించారు. త్వరగా పనులు చేపట్టి, పూర్తి చేయాలని, మాస్టర్ ప్లానింగ్ ఆధారంగా నగరంలోని అన్ని ఐలాండ్స్‌ను ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట మున్సిపల్ ఏఈ చైతన్య, సిబ్బంది పాల్గొన్నారు.